విజయవాడ: గతంలో ఏర్పాటు చేయలేక పోయిన రాష్ట్ర స్థాయి విస్తృత వీడియో సమావేశాన్ని రేపు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు.
రేపు జరగబోయే వీడియో కాన్షరెన్స్లో గతంలో కమిషన్ బహిష్కరించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీఓలంతా పాల్గొంటారు. ఇలాంటి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేసేందుకు గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అంతా సవ్యంగా నడవడం మొదలయింది.
బుధవారం ఉదయం 11గంటలకు ఈ వీడియో సమావేశం ప్రారంభమవుతుంది. గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలయి, ఎనికల కోడ్అమలులోకి వచ్చినందున ఎన్నికల నిర్వహణ తో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడం గురించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కు ప్రాధాన్యం ఇస్తున్నందున, ఎన్నికల ప్రక్రియ వల్ల వ్యాక్సినేషన్ కు ఎలాంటి అంతరాయం రాకుండా చూడాలని రేపటి సమావేశంలో కమిషనర్ కోరనున్నారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్ నాథ్ దాస్, , డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ తో పాటు , ఆర్థిక, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్ శాఖల కమీషనర్లుకూడా పాల్గొంటారు.
గతంలో సమావేశానికి హాజరకాలేమని, ఎన్నిలకు విధులరాలేమని చెప్పినప్పటికి,సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులంతా ఎన్నికల కమిషన్ వీడియో సమావేశానికి హజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు.