తెలంగాణ ప్రభుత్వ ప్రియతమ కాంట్రాక్టర్ , ఆంధ్రప్రదేశ్ కుచెందిన మేఘా కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) కత్తి దూశారు. రిపబ్లిక్ డే పతాకావిష్కరణ తర్వాత మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులనుంచి తెలంగాణాను కాపాడుకోవాలని వాళ్లలో ఒకరు ముఖ్యమంత్రి కెసిఆర్ అయితే, రెండో వ్యక్తి కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి అని జగ్గారెడ్డి అన్నారు. మేఘా కృష్ణారెడ్డి ప్రకటించిన రు.30 వేల కోట్ల ఆస్తి తెలంగాణ అప్పుల్లోనే నని ఆయన అన్నారు.
మేఘా కృష్ణారెడ్డి హిస్టరీని తాను విడతల వారీగా వెళ్లడిస్తానని, తొందర్లోనే సీరియల్ మొదటి భాగం విడుదలచేస్తానని ఆయన ప్రకటించారు.
జగ్గారెడ్డి అసుల ఏమన్నారంటే…
జగ్గారెడ్డి మన్ కి బాత్ కాంగ్రెస్ పార్టీ కే లియే,పబ్లిక్ కే లియే
మేఘా కృష్ణా రెడ్డి వల్ల రాష్ట్రానికే కాదు తెలంగాణ కాంగ్రెస్ కి కూడా ప్రమాదం హెచ్చరిస్తున్నాను.
తెలంగాణ ప్రాజెక్ట్ లలో మేఘా కృష్ణా రెడ్డి అవినీతి పై పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ లో దీని పై తీర్మానం చేయాలి. ఆర్ధికంగా టీఆరెస్,బీజేపీ కి మేఘా కృష్ణా రెడ్డి వనరులు సమీకరిస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ ముందు మేఘా కృష్ణారెడ్డి ని టార్గెట్ చేయాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉనికికే చాలా ప్రమాదం..
చరిత్ర లో కూడా శివాజీ ఇలాగే చేసి మొగల్స్ తో యుద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదట ఆర్ధికంగా బలపడేందుకు వనరులు సమకూర్చుకోవాలి. మేఘా కృష్ణారెడ్డి లాంటి వారిని కొడితేనే పార్టీ కి భవిష్యత్తు.
మేఘా కృష్ణారెడ్డి టీఆరెస్ లేదా బీజేపీ అధికారంలో వచ్చేందుకే సహాయపడతాడు. మేఘా కృష్ణారెడ్డి 2004-2005 లో మారుతి కారు లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ తిరిగాడు.
అధికారికంగా రాష్ట్ర విభజన తరువాత 30 వేల కోట్లకు అధిపతినని అధికారికంగా ప్రకటించారు!ఆరేళ్లలో ఇది ఎలా సాధ్యం?
అరేళ్లలో మారుతి కారు పోయి సొంత విమానం,సొంత హెలికాప్టర్ వచ్చింది. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కదా!
మేఘా కృష్ణారెడ్డి ప్రకటించిన రు.30 వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన 3 లక్షల కోట్ల అప్పులోనివేనా?
కాళేశ్వరం , మిషన్ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టలను కెసిఆర్ ఏకపక్షంగా మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చింది నిజమే కదా!
మేఘా కృష్ణారెడ్డి ఆంధ్రా బాణమే కదా..
తెలంగాణ డబ్బులతో ఆర్ధికంగా ఎదిగి, తెలంగాణ లో పర్యటిస్తూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి మేఘా కృష్ణారెడ్డి చూస్తుంది నిజమే కదా.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇదే ఆంధ్ర కాంట్రాక్టర్ లు రాష్ట్రాన్ని దోచ్చుకుంటున్నారని రోజు ఆరిచాడు. వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. కదా.వాళ్లని తరిమేయాల్సిందే అన్నాడు.
మరి ఈ మేఘా కృష్ణారెడ్డికి తెలంగాణలోకి ఎక్కడి నుండి వచ్చాడు?
మేఘా కృష్ణా రెడ్డికి సీరియల్ గా అన్ని వెలుగులోకి తెస్తా మాట్లాడుతా. త్వరంలో సీరియల్ రెండో భాగం.