రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రంగంలో దూకారు. పొద్దుటి నుంచి స్తంభించి ఉన్న కమిషన్ కార్యకలాపాలను పునరుద్ధరించారు.
మొదట ఏపీ పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. ఈ రోజు మొదలు కావలసి ఉన్న మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చి వేశారు. రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నిలను ఒకటి, రెండు, మూడు విడతలగా నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ల తో రమేష్ కుమార్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు కావలసిన ఏర్పాట్లను సమీక్ష చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు అంతా హాజరు కావాలని ఉత్తర్వుల జారీ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల తీరు మీద కేంద్ర హోం సెక్రటరీకి లేఖ రాశారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని రాష్ట్రంలో కొన్ని ఉద్యోగ సంఘాలు చెప్పిన విషయం ఆయన కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. ఇదే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అంటూ ఈ బాధ్యత నిర్వర్తించేందుకు కేంద్ర సిబ్బందిని కేటాయించాలని ఆయన కేంద్రాన్నికోరారు.
ఇపుడు ఉద్యోగుల సంఘాల నేతలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి ఏమంటారో చూడాలి.