ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొద్దిగా మారింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న విధానం సరైందని. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ధృవీకరించింది. నేడు తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో తెలుగు వాడైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు (ఎల్ ఎన్ ఆర్) ఉండాల్సిఉండింది. అయితే, తీర్పు ఎల్ ఎన్ ఆర్ బెంచ్ లో ఉంటే కమిషన్ కు అనుకూలంగా వస్తే దానికి విపరీతార్థాలు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదొకటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలనలో ఉంది. అందుకే ఎల్ ఎన్ ఆర్ తప్పుకున్నారు. అయితే, తర్వాత ఏర్పడిన బెంచ్ కూడా పంచ్ మార్చలేదు. పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా జరగవా అని కమిషనొక వైపు, ప్రభుత్వం, ఉద్యోగుల సంఘాలు మరొకవైపు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూశాయి.కేసు అన్నపుడు ఎవరో ఒకరు ఓడిపోక తప్పదు. తీర్పును గౌరవించక తప్పదు. ఈ వ్యవహారంలో బెంచ్ మారినా పంచ్ మారలేదు. కాకపోతే, ఎన్నికల షెడ్యూలే మారింది.
సుప్రీంకోర్టు తీర్పులో ఏమి రాస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో వారం పది రోజులుగా ఎదురయిన పరిస్థితి చాలా చిత్రమయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, ప్రభుత్వం యంత్రాంగం కమిషన్ పరిధిలోకి వస్తుంది.ఇక్కడ ఐఎఎస్ అధికారులు, ఐపిఎస్ అధికారులు, చివరరకు ఉద్యోగులు కూడా కమిషన్ ని బహిష్కరించారు. ఎన్నికల్లో పాల్గొనేది లేదు పొమ్మన్నారు. ప్రాణ భయం అన్నారు. కమిషనర్ మీద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విపరీతమయి రియాక్షన్ ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికల కమిషన్ కు ఎదురయి ఉండదు. ఇదంతా కచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టి కి వెళ్లి ఉంటుంది. అందువల్ల ఉత్తర్వులలో దీని మీద ఎవైనా వ్యాఖ్యలు చేసి ఉండాలి. తీర్పు కాపి వస్తే గాని ఈ విషయాలు బయటకు తెలియవు. ఒక వేళ సుప్రీంకోర్టు తీర్పులో ఈ విషయాల మీద వివరణ ఇచ్చి ఉంటే అదొక ల్యాండ్ మార్క్ తీర్పు అయి తీరుతుంది.
తొలివిడత షెడ్యూల్ నాలుగో విడత అయింది. రెండో షెడ్యూల్ మొదటిదయింది.
మారిన షెడ్యూల్ ఇదే…
తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 9న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
రెండో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్
ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 13న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
3వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్
ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 17న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
ఫిబ్రవరి 17న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
4వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్
ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు