ఫిబ్రవరిలో 21, 28 తేదీల్లో గుజరాత్ స్థానిక ఎన్నికలకు షెడ్యూలు విడుదలలైన విషయం ఎపి ప్రభుత్వం, ఉద్యోగు సంఘాల నాయకులు గుర్తించాలని అక్కడ ఎన్నికలు జరిపితే రాని కరోనా ఇక్కడ ఎలా వస్తుందో, ఉద్యోగుల ప్రాణాలు ఎలా పోతాయో ప్రజలకు చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఎన్నికల వ్యతిరేకిస్తున్నవారిని కోరారు. జగన్ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలు అసంబద్ద వాదనలు చేస్తున్నారని, వారిది కరోనా భయం కాదు, ఎన్నికల్లో ఓడిపోతామన్న రాజకీయ భయమని ప్రజలకు అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికలు జరిపితే కొరోనా ఎక్కువ అవుతుందన్న వితండవాదం గుజరాత్ లో ఎవరూ చేయని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్కడ ఏ పార్టీ గురించి కూడా కరోనా నుంచి ప్రాణభయం ఉందని గోల చేయడం లేదు, కోర్టు కెక్కడం లేదని సుధాకర్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల నేతలు ప్రభుత్వంతో చేతులు కలపి ఇలా కోర్టులను ఆశ్రయిస్తున్నాని ఆయన ఆరోపించారు.
గుజరాత్ లో ఆరు మునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21 ఎన్నికలు జరుగుతాయని, 23 లెక్కింపు నిర్వహిస్తామని, 81 మునిసిపాలిటీలకు, 31 జిల్లా పరిషత్ లకు, 231 తాలూకాపంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయని, మార్చి2నలెక్కింపు జరుగుతుందని గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలు షెడ్యూలు ప్రకటించింది.
‘ఎపి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు ఆపేందుకు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ వేయడం అన్యాయం. 18 ఏళ్లు దాటిన వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తూ కొత్త జాబితా రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది సాకుగా చూపి ఎన్నికలు ఆపాలని కోరడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. 2019 ఎలక్టోరల్ రూల్స్ ద్వారా ఎన్నికలు జరపటం వల్ల 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారని పిటిషన్ వేయడం హాస్యాస్పదం,’ అని డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు.