మహాత్మా గాంధీ హత్య జరిగిన సమయాన్ని గుర్తు చసే సైరెన్ మళ్లీ మోగించడం ప్రారంభించాలని గాంధీజీ మనవడు తుషార్ గాంధీ రాష్టప్రతి నామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేశారు. 1948 జనవరి 30 న నాథూరామ్ గాడ్సే హత్య చేశాడు. మరొక ఆరు రోజుల్లో గాంధీ హత్య 73వ వర్థంతిని అమరవీరుల దినంగా దేశమంతా జరుపుకుంటారు. నివాళులర్పిస్తారు. కొద్ది సంవత్సరా కిందట గాంధీజీని 1948జనవరి 30న మధ్యాహ్నం తర్వాత 5.17నిమిషాలకు గాడ్సేకాల్పి చంపిన దుర్ముహూర్తాన్ని గుర్తుచేస్తూ దేశంమతా 5.17 PM కు సైరెన్ వాయించే వారు. సైరెన్ ఉద్దేశేమిటంటే, ఆ క్షణాన దేశ ప్రజలంతా తన పనులు నిలిపి వేసి రెండు నిమిషాలు మౌనం పాటించడం.ఈ సంప్రదాయం పాటించడమే మానేశారు. మొదట్లో దీనిని నిర్లక్ష్యం చేయడం 1980 దశాబ్దం చివర్లో మొదలయింది. తర్వాత క్రమంగా సైరెన్ ని, సైలెన్స్ ని అంతా మర్చిపోయారు.
మధ్యాహ్నం 5 తర్వాత చాలా కార్యాలయాలు, స్కూళ్లు మూత పడతాయి కాబట్టి ఆ టైం లో నివాళులర్పించడం కష్టం. అందుకని దీనిని ఉదయం 11 గంటలకు మార్చారు. అయితే,
ఇపుడు ఈ సంప్రదాయాన్ని పునరుద్దరించాలని తుషార్ గాంధీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందకు విజ్ఞప్త చేశారు. ఈ జనవరి 26న ఈ సైరెన్ గురించి, రెండు నిమిషాల మౌన నివాళి గురించి ప్రజలకు గుర్తు చేయాలని ఆయన కోరారు.