ప్రతి సంవత్సరం జనవరి 25న భారత దేశం నేషనల్ వోటర్స్ డే జరుపు కుంటుంది. ఇది 2011 నుంచి అమలు అవుతూ ఉంది. భారత ఎన్నికల కమిషన్ 1950, జనవరి 25న ఏర్పడింది. దీనికి సంస్మరణగా ఆ రోజుని 2011 లో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నేషనల్ వోటర్స డే గా ప్రకటించింది. 18 సం. దాటిన యువకులను ఓటర్లుగా నమోదు చేసి, ప్రజాస్వామిక రాజకీయ స్పృహ కల్పించడం దీని ఉద్దేశం. రేపు జనవరి 25న ఎన్నికల కమిషన్ దేశంలోని వోటర్లందరికి డిజిటల్ కార్డులు ఇచ్చే ప్రోగ్రాం ప్రారంభిస్తున్నది. దీనిని e-EPIC (Electronic Electoral Photo Identity Card) అంటారు. ఇది రెండు దశల్లో సాగుతుంది. మొదటి దశ జనవరి 25 నుంచి 31 దాకా ఉంటుంది . ఇది కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి. రెండో దశ ఫిబ్రవరి 1 నుంచి వోటర్లందరికి వర్తిస్తుంది. ఫోన్ నెంబర్ ఉన్న ప్రతి వోటర్లు సులభంగా eEPIC నిడౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది పిడిఎప్ లో QR కోడ్ తో ఆధార్ కార్డులాగా. దీని ఉంటుంది. దీనిని లామినేట్ చేసుకోవచ్చు. మొబైల్ లో స్టోర్ చేసుకోవచ్చు.