ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ మొదలయింది. ఎన్నికల ను బహిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ కు సీనియర్ అధికారులను పంపలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ హాజరుకాలేదు. డిజిపి గౌతమ్ సవాంగ్ కూడా సమావేశాన్ని బహిష్కరించారు. ఇలాడే పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి గిరిజా శంకర్ ఇతర సీనియర్ అధికారులెవరూ రాలేదు.
ఈ రోజే ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ మీద చర్చలు జరిపేందుకు ఏర్పాటయిన విస్తృత వీడియో కాన్ఫరెన్స్ ఇది.
రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ చాలా సేపు ఎదురుచూశారు. అంతా ప్రభుత్వం మాట మీద నిలబడ్డారు. వీడియో కాన్ఫెరెన్సు కు హాజరయ్యేందుకు ఒక్క అధికారి కూడా రాలేదు. కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించిన సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల మీద ఎలాంటి ఎస్ ఇ సి చర్యలు ఎలా తీసుకుంటారో చూడాలి. ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.