కరోనా కారణంగా ఈ సారి బడ్జెట్ (బడ్జెట్ 2021-2022) ను కాగితాల మీద ప్రింటు చేయడంలేదు. ఎలెక్ట్రానికల్ గా సభ్యులకు అందిస్తున్నారు. నవంబర్ 26,1947న ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ నుంచి గత ఏడాది దాకా బడ్జెట్ ను భారీ పుస్తకాల రూపంలో అందించే వారు. బడ్జెట్ పుస్తకాల ప్రింటింగ్ అనేది పెద్ద కార్యక్రమం. ఈ ప్రింటింగ్ పని హల్వా తయారీతో మొదలవుతుంది. బడ్జె్ట్ ప్రింటింగ్ మొదలయ్యాక సిబ్బంది పార్లమెంటులోనే ఉండిపోవాలి. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు
ఈ రోజు హల్వా కార్యక్రమం జరిగినా ప్రింటింగ్ కార్యక్రమం లేదు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర సీనియర్ అధికారలు పాల్గొన్నారు. ఈ సారి బడ్జెట్ కు సంబంధించిన 14 డాక్యమెంట్లని అందుబాటులోకి తెచ్చేందుకు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ విడుదల చేశారు.
ఈ యాప్ పార్లమెంటు సభ్యులకే కాకుండా దేశ ప్రజలందరికి అందుబాటులో ఉంటుంది. ఇందులో యాన్యువల్ ఫైనాన్సియల్ స్టేట్ మెంట్ (బడ్జెట్), డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్,ఫైనాన్స్ బిల్ ఉంటాయి. యాప్ ని www.indiabudget.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.