చంచల్ గూడ జైల్ నుండి తెలుగుదేశం మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ విడుదలయ్యారు. హఫీజ్ పేటలోని ఒక భూ వివాదానికి సంబంధించి బోయినపల్లి కి చెందిన ప్రవీణ్ రావు, సునీల్ రావు,నవీన్ అనే ముగ్గురుసోదరులను కిడ్నాప్ చేసిన కేసులో అఖిల ప్రియ అరెస్టయిన సంగతి తెలిసిందే. గత 18 రోజులుగా ఆమె చంచల్ గూడ జైల్లో ఉంటున్నారు.
కిడ్నాప్ కేసులో ఆమె మొదటి నిందితురాలు. అయితే, ఆమెకు సికిందరాబాద్ సెషన్స్ కోర్టు నిన్న పది వేల పూచికత్తు, ఇద్దరు జామీన్ తో కండిషన్ బెయిలు మంజూరు చేసింది. ఈ షరతుల ప్రకారం ఆమె ప్రతి సోమవారం నాడు బోయిన పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకంచేయాలి. హైదరాబాద్ విడిచివెళ్లరాదు. విచారణలో పోలీసులకు సహకరించాలి.
అఖిల ప్రియ విడుదల కోసం ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తును అనుచరులు జైలుదగ్గరకు చేరుకున్నారు. వారంతా ఆమె విడుదల కాగానే సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు.