మున్సిపల్ ఐటి శాఖల మంత్రి కేటి ఆర్ కాన్వాయ్ కు బిజెపి కార్యకర్తలు అడ్డుతగిలారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి ప్రజలు నిధులివ్వాల్సిన పనిలేదని నిన్నకోరుట్ల టిఆర్ ఎస్ శాసన సభ్యుడు విద్యాసాగర్ రావు చేసిన ప్రకటనకు వారు నిరసన తెలుపుతున్నారు.
ఇందులో భాగంగానే ఈ రోజు భారతీయ యువమోర్చా సభ్యులు జైశ్రీరాం, కెటిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ జూబ్లీ హిల్స్ లో కెటిఆర్ కాన్వాయ్ కి అడ్డుతగిలారు.
భవ్య రామ మందిర నిర్మాణ నిడిసేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే విద్యా సాగర్ ను వెంటలే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తర్వాత కెటిఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న యువ మోర్చా హైదరాబాద్ అదికార ప్రతినిది నీలం రతన్ కుమార్, నిరసన తెలిపిన పది మంది యువమోర్చ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
రామ్ మందిరం నిర్మాణం కోసం ప్రజలను డబ్బులు అడుగుతుంటే మీరు అడగవద్దని చెప్పడానికి మీరెవరూ అని వారు ప్రశ్నించారు