కోరుట్ల టిఆర్ ఎస్ ఎమ్మెల్యే కల్వ కుంట్ల వ విద్యాసాగర్ బిజెపి చేస్తున్న రాామాలయం హడావిడికి ఖండించారు.
తెలంగాణలో తమకు వూరూరున రామాయాలయాలున్నాయని, తమకు ఉత్తర ప్రదేశ్ లోని రామాలయం అవసరం లేదని ఆయన జగిత్యాలలో అన్నారు.
ఉత్తర ప్రదేశ్ అయోద్యరామాయలం పేరు చెప్పి భారతీయజనతా పార్టీ నేతలు చందాలవసూళ్లకు దిగడం మీద ఆయన అభ్యంతరం చెప్పారు. బిజెపినేతలకు చందాలీయవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
విద్యాసాగర్ ఇంకా ఏమన్నారంటే…
మేమందరం శ్రీరాముని భక్తులమే. బొట్టు పెట్టుకుంటేనే రాముడి భక్తులం అవుతామా?
బీజేపీ నాయకులు అయోధ్యలో రామ మందిరం కోసం చందాలంటూ వసూలుకు పూనుకున్నారు.
ఉత్తర్ప్రదేశ్ లో ఉన్న ఆ రాముడు మనకెందుకు? మన గ్రామాల్లో మనకు రాముడు ఉన్నడు.
అయ్యోధ్య రామాలయనికి చందాలు ఎవరు కూడా ఇవ్వొద్దు.
ఇప్పుడు కొత్తగా బీజేపీ నేతలు రామమందిరం పేరుపై బిచ్చమెత్తుకుంటుర్రు.
ఎవరి గ్రామాల్లో వారికి రామాలయలు ఉంటే, బీజేపీ నేతలంతా మరొక రామమందిరంపై కొత్త నాటకం ఆడుతున్నారు.
రామమందిర నిర్మాణం పేరుతో బీజేపీ కొత్త రాజకీయ డ్రామా ఆడుతోంది.