“సంజయ్, మాటలు చాలు, కెసిఆర్ ని ఎపుడు జైల్లో పెడతావో చెప్పు”

బండి మీద జగ్గారెడ్డి చరకలు

తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న గుళ్ల హడావిడి మీద కూడా జగ్గారెడ్డి బాణాలు విసిరారు. ‘అసలు సంజయ్ కుమార్ ఎపుడూ పాతగుడికి వెళ్లి, అక్కడొక దీపం వెలిగించాడా? ఇపుడు సడన్ గా సంజయ్ కు గుళ్లు కనబడుతున్నాయి.  మరొక వింత కేంద్ర హంమంత్రి అమిత్ షాకు ఎక్కడో పాత బస్తీలో చార్ మినార్ పక్కన  భాగ్య లక్ష్బి గుడొకటుందని, అక్కడి కెళ్లి అమ్మవారి ఆశీస్సలు పొందాలనిపించింది. ఇది వింతకాదా. ఆరేళ్లుగా ఆయన కేంద్రం అధికారంలో ఉన్నారు. హైదరాబాద్ చాలా సార్లు వచ్చారు.అపుడు ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారు గుర్తుకే రాలేద. తీరా జిహెచ్ఎంసి ఎన్నికలపుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలనిపించింది,’ అని జగ్గారెడ్డి ఎత్తి పొడిచారు.

ఈ మధ్య తరచు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు సంజయ్ ముఖ్యమంత్రి కెసిఆర్ జైల్లో పెట్టిస్తానని ప్రకటనలు చేస్తుండటం మీద కూడా జగ్గారెడ్డి చురకలు అంటించారు.

’కేసీఆర్ ని జైల్లో పెట్టిస్తే బండి సంజయ్ హీరో ఐపోతాడు, అనుమానం లేదు. జైల్లో పెట్టిస్తానని అనేమాట వినివిని బోర్ కొడుతాంది. సంజయ్, ఇక చాలు,జైల్లో ఎప్పుడు పెడతావో చెప్పు’ అని జగ్గారెడ్డి అన్నారు.

సీఎం కెసిఆర్ ని  బీజేపీ ఆ ప్రకారంగా బండ బూతులు తిడుతుంటే… కెటిఆర్ ఏమయ్యాడు, టిఆర్ ఎస్ లో ఉండే బడా బడా నాయకుల ఏమయ్యారు? వాళ్ల పౌరుషం ఏమైంది?, అని జగ్గారెడ్డి విస్తుపోయారు.

అందుకే, బిజెపి, టిఆర్ ఎస్, ఎంఐఎం కలసి నాటకమాడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

 

కెటిఆర్ ని ముఖ్యమంత్రి చేయడంలో అమిత్ షా హ్యాండ్

తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం వెనక  బీజేపీ ఆట ఉందేమోనని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

కెసిఆర్ కుమారుడు  కేటీఆర్ ని సీఎం చేయడం అనేది బీజేపీ డైరెక్షన్ లో నడుస్తూ  ఉందేమోనని తనకు అనుమానం కలుగుతూ ఉందని ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ అనుమానం వ్యక్తం చేశారు.

ఎందుకంటే, అమిత్ షా డైరెక్షన్ లోనే చాలా తెలంగాణ పరిణామాలు జరుగుతున్నాయి,  ప్రజలను మోసం చేసే పనిలో టిఆర్ ఎస్  ఎంఐఎం.. బీజేపీ కలసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. అందుకే ఇలాగే కెటిఆర్ ని ముఖ్యమంత్రిని చేయడం లో కూడా అమిత్ షా హస్తం కాదనలేం అని ఆయన అన్నారు..

జిహెచ్ ఎంసి  మేయర్ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ముల్లా ఈ మూడు పార్టీలు పంచాయతీ సెటిల్ చేసుకుంటాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తేలిపోతుంది.

‘బీజేపీ..టిఆర్  ఎంఐఎంలు మూడు గుంటనక్కల పార్టీలు,తెలంగాణ లో ప్రజల సమస్యల కంటే..హిందు..ముస్లిం విద్వేషాలు నడుస్తున్నాయి,’అని అయన అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *