(జె చంద్రశేఖర్, హైదరాబాద్)
అడవిలో వానకాలపూ పచ్చదనమే కాదు, వానలు ఉడిగిన వట్టికాలమూ అందంగానే ఉంటుంది, మేం అనంతగిరిలో చూశామ్…
సరదాగా గడిపేందుకని ఊరు దాటి వెళ్తే చాలు ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. వెంటనే మానసిక పరిస్థితి పాజిటివ్ గా మారిపోతుంది. శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ పెరుగుతాయి. వీటినే హ్యాపీ హార్మోన్స్, feel-good harmones అంటారు. ఆరోగ్యంగా, ఉల్లాసంగా మారిపోతాం. వూరికి వెళ్లదామనగానే, పిక్కిక్ కావచ్చు, సరగా ట్రెక్ కావచ్చు, లేదా తీర్థయాత్ర కావచ్చు, యాాత్ర అనగానే పెద్దల్లో పిల్లల్లో సమానంగా ఫీల్ గుడ్ హార్మోన్స్ తీసుకు వచ్చే మార్పును ఎపుడైనా గమనించారా? అదే ఆరోగ్యం, ఆనందం.
ఇలా సరదాగా గడిపేందుకు ఎక్కడో దూరానికి వెళ్లనవసరం లేదు. మనచుట్టూర ఉన్న కొండలను గుట్టలనే ఎంచుకోవచ్చు. మనకు దగ్గిర ఉన్నందున వాటి విలువ తెలియక చాలా కాలం ఈ ప్రకృతి సౌందర్యాన్ని నిర్లక్ష్యంచేస్తూ ఉంటారు.
నిజానికి మనపక్కనే ఉన్న కొండల్లో, గుట్టల్లో చిన్న చిన్న వనాల్లో చాలా వింతలుంటాయి. వాటిని కనిపెట్టేందుకు (Explore)చేయడంలో ధ్రిల్ ఉంటుంది. కొండలు, గుట్టలు, వనాలు ఎన్ని సార్లు చూసినా తనివితీరదు. ఎందుకంటే, వాటి సౌందర్యం ఒక్కొక్క టైమ్ ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క విధంగా, కొత్తగా,వింతగా కనిపిస్తుంది. ఈ వింతచూసేందుకే మేం హైదరాబాద్ చాలా దగ్గిరగా ఉన్న చాలాపాపులర్ అనంతగిరిని ఎంచుకున్నాం.
అనంతగిరి హిల్ స్టేషన్ వికారాబాద్ జిల్లాలో ఉంది. హైదరాబాద్ సిటికి 90 కిమీ దూరమే. ఇక్కడి మంచిరోడ్డుంది, రైలు మార్గమూ ఉంది.మా టీమ్ కార్లో వికారాబాద్ చేరుకుంది. ఈ సారి ఇక్కడున్న అడవిలో కొత్త ట్రెకింగ్ స్పాట్స్ కనిపెట్టాలనుకున్నాం. కనిపెట్టాం. ఈ exploration గొప్ప అనుభూతినిచ్చింది. రాత్రంతా అక్కడే గడిపాం. ఇదొక మరచిపోలేని అనుభూతి. వర్షాకాలం పోయింది. దాంతోటే పచ్చదనం పోయింది. ఆకురాలు కాలపు వెచ్చటి వాసన అనంతగిరిలో గొప్పగా ఉంటుంది. అడవిని చూడటంలో అనే అంతా ఉంది. వర్షాకాలంలో జలపాతలు, పచ్చని చెట్టు, వానలో తడిసి ముద్దువుతున్న అడవి ఒక రకం అనందాన్ని, ఆకురాలు కాలపు మరొక అనుభవాన్ని అందిస్తుంది. ఈ ట్రిప్ లో మేం చూసిందిదే.
తర్వాత అనంత పద్మనాభ స్వామి గుడి ని దర్శించాం. కాబట్టి ముందు మనం చుట్టూర ఏమున్నాయే అన్వేషించాలి… మీరు మీ చుట్టూర ఒక సారి కలియచూడండి.
(శేఖర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, హైదరాబాద్)