రేపు అధ్యక్ష బాధ్యత చేపడుతున్న జో బైడెన్ టీమ్ లో భారతీయ సంతతి వాళ్లు చాలా మంది ఉంటున్నారు. ఇందులో ఒక తెలుగు వాడు కూడా ఉంటున్నారు. ఆయన పేరు చొల్లేటి వినయ్ రెడ్డి.
ఆయన నియామకాన్ని అమెరికా ప్రభుత్వ వెబ్ సైట్ లో ప్రకటించారు.
ఆయన సొంతవూరు తెలంగాణ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల్ పోతిరెడ్డి పేట. ఆయన తల్లితండ్రులు 1970లో అమెరికా వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. తండ్రి నారాయణ రెడ్డి హైదరాబాద్ లోనే ఎంబిబిస్ చదివారు. వైట్ హౌస్ లో వినయ్ రెడ్డి హోదా స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ . వినయ్ రెడ్డి కుటుంబానికి ఇంకా పోతిరెడ్డి పేటతో సంబంధాలున్నాయి. ఆయన కుటుంబానికి అక్కడ ఇల్లు, కొంత భూమి కూడా ఉంది. ఏడాదికొకసారైన వినియ్ తల్లితండ్రులు సొంతవూరు సందర్శిస్తుంటారు.
నారాయణ రెడ్డి సోదరులు హైదరాబాద్ నివసిస్తున్నారు.
వినయ్ తాత చొల్లెటి తిరుపతి రెడ్డి 30 సంవత్సరాల పాటు పోతిరెడ్డి పేట సర్పంచుగా ఉన్నారు
బైడెన్ కు ఉపన్యాసాలు రాయడంలో వినయ్ బాగా అనుభవం ఉంది. ఒబామా రెండో టెర్మ్ లో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నపుడు ప్రధాన స్పీచర్ రైటర్ వినయ్ రెడ్డియే. తర్వాత నేషనల్ బాస్కెట్ బాల్ అసోయేషన్ కు స్ట్రటజిక్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెశిడెంటుగా ఉన్నాడు. ఒబామా-బైడెన్ హయాంలో అమెరికా ఎన్వైరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ లలో కూడా సీనియర్ స్పీచర్ రైటర్ గా పని చేశారు. ఒబామా-బైడెన్ ఎన్నికల క్యాంపెయిన్ లోఆయనడిప్యూటీ స్పీచ్ రైటర్ గా ఉన్నారు.
ఆయన ఒహియో స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లా లో విద్యనభ్యసించారు. ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లతో న్యూయార్క్ లో నివసిస్తున్నారు.
Like this story? Share it with friends!
అమెరికా వెబ్ సైట్ లో రాసిన విశేషాలు
Vinay Reddy serves as a speechwriter on the Biden-Harris Transition and served as Senior Advisor and Speechwriter for the Biden-Harris Campaign. He previously served as chief speechwriter to Vice President Biden in the second term of the Obama-Biden White House, after which, he worked as Vice President of Strategic Communications at the National Basketball Association. During the Obama-Biden Administration, he also served as senior speechwriter at the U.S. Environmental Protection Agency and the Department of Health and Human Services, deputy speechwriter for the Obama-Biden reelection campaign, and speechwriter for his home state Senator, Sherrod Brown of Ohio. Reddy grew up in Dayton, Ohio, the middle of three sons in an immigrant family and is a product of Ohio public schools from kindergarten to Miami University to The Ohio State University College of Law. He currently lives in New York with his wife and their two daughters.