అమరావతి : జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ని దెబ్బతీసేందుకు బ్రహ్మాస్త్రంగా పెట్టుకున్న అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం వీగిపోయింది. ఈ రోజు అమరావతి హైకోర్టు ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద ఆసక్తి కరమయిన వ్యాఖ్యలు చేసింది. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని పేర్కొంది.
రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను హైకోర్టు కొట్టి వేసింది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసుల మీద జగన్ ప్రభుత్వానికి చాలా ఆశలుండేవి. ఈ కేసులు పెరిగి పెద్దవై తెలుగుదేశాన్ని చట్టుముడతాయని, తెలుగు దేశం పెద్దలను కూడా చుట్టుకుంటాయని చెబుతూ వచ్చింది.
అంతేకాదు,దీని మీద సిఐడి ఎంక్వయిరీ కూడా వేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి జస్టిస్ రమణ వివాదం కూడా ఇన్ సైడ్ ర్ ట్రేడింగ్ తో ముడివడి ఉంది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ తమ మీద కేసులు పెట్టిన ఫైల్ చేసిన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేయాలని కిలారు రాజేశ్, నార్త్ ఫేస్ హోల్డింగ్స్ ప్రవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపుడి వెంకటేశ్వర్లు, చేకూరి తేజస్వి, గుంటూరులలిత సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కు చెందిన పివి రాఘవ తదిరులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ మీద డిసెంబరలో నే విచారణ ముగిసింది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది జగన్ ప్రతి పక్ష నాయకుడిగా ఉన్నప్పటినుంచి చేస్తున్న వాదన ఇది . ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇక అన్ని సాక్ష్యాలతో దాడి మొదలవుతుందనుకుంటే కేసే వీగిపోయింది.
భూములు కొనడమే తప్పంటే ఎలా, భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని కేవలం ప్రభుత్వం తమ కక్షసాధిస్తోందని వారు క్వాష్ పిటిషన్ వేశారు.
అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టు పేర్కొంది.
ఇన్సైడర్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.