అమరావతి రాజధాని పరిథిలో “ఇన్ సైడర్ ట్రేడింగ్” జరిగిందన్న ఆరోపణలకు తెరదించుతూ కేసును కొట్టివేస్తూ హైకోర్టు నేడు తీర్పును ప్రముఖ సామాజికి ఉద్యమకారుడు టి.లక్ష్మినారాయణ స్వాగతించారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద ఆయన వ్యాఖ్య
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు చేయడం మొదలైన నాటి నుండి నేను టీవి చర్చల్లో ఒక ప్రశ్న వేస్తూ వచ్చాను. భూములు అమ్మిన వారు ఎవరైనా తాము మోసపోయామని పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారా? అని అడిగే వాడిని. అలాగే అమరావతి రాజధాని పరిథిలోని గ్రామాల్లో దీక్షా శిబిరాలను సందర్శించిన ప్రతి సందర్భంలో, ఎవరైనా రైతులను మోసగించి భూములను కొన్నారా? అని అడిగాను. ఏ ఒక్కరూ మోసపోయానని చెప్పలేదు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలకు తగిన ఆధారాలులేవని నేటి హైకోర్టు తీర్పుతో రూడీ అయ్యింది.