యాదాద్రి భువనగిరి : నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి తొందరలో జరుగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవక పోతే రాజకీయాలు గురించి ఇక మాట్లాడనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శపథం చేశారు.
ఈ రోజు ఆయన భువనగిరి ఆర్&బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ శపథం చేశారు.
నాగార్జున సాగర్ లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
“ఎన్నికల గురించి 7 సంవత్సరాలు గా పట్టించుకోని టిఆర్ ఎస్ నాయకులు ఇపుడు ఎన్నికల కోసం గొరెలు పంపిణీ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో మత రాజకీయాలు వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడింది. ఆ పరిస్థితి నాగార్జున సాగర్ లో లేదు. ఇక్కడ కాంగ్రెస్ విజయానికి అనుకూల పరిస్థితులున్నాయి. జిల్లా మంత్రి భువనగిరి ని పట్టించుకోవడమే లేదు. కేంద్రం నుండి నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్నిఅభివృద్ధి చేస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క వైపు చేస్తూ మరో వైపు పోరాటలు చేస్తున్నాము. అందువల్ల నాగార్జున సాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయం,’ అని కోమటిరెడ్డి అన్నారు.
తెలంగాణలో ఐ కె పి సెంటర్ లు బంద్ పెడితే టి ఆర్ ఎస్ ఎంపీ మంత్రులు ఎమ్మెల్యే ను రైతులు ఉరికించి కొడతారని చెబుతూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వ తరహా అసెంబ్లీ లో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
భువనగిరి మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కు మంత్రి జగదీష్ రెడ్డి రావడం సిగ్గు చేటు అని అంటూ కేసీఆర్ అవినీతి పై బీజేపీ రాజీపడ్డా మేము వదిలిపెట్టి ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
‘కేసీఆర్ స్వగ్రామం చింతమడక వాళ్లు అమెరికాలో ఉన్నా వారికి డబ్బులు అందుతున్నాయి. యాదగిరిగుట్ట లో షాపులు ఇండ్లు కోల్పోయిన వారికి ఎందుకు ఇవ్వడం లేదు?,అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా అనే అనుమానం ప్రజలకు కలుగు తూఉందని చెబుతూ యాదగిరిగుట్ట లో ని ఫామ్ హౌస్ కు రోడ్డు వేసేటపుడు ఇండ్లు కోల్పోయిన బాధితులకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు.
‘ 3 సం”ల నుండి డి ఎస్ సి నోటిఫికేషన్ లేక 4 వెేల పాఠశాలలు మూతపడ్డాయి ప్రవైట్ ఉపాద్యాయుల ఆత్మహత్య లకు కేసీఆరే కారణం. కేంద్రం, రాష్ట్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జనవరి 19న చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది. పోలీసులు అడ్డుపడ్డా రాజ్ భవన్ ని ముట్టడించి తీరుతాం,’ అని కోమటిరెడ్డి అన్నారు.