కమిటీకి మాన్ గుడ్ బై, మిగతా వాళ్లు కూడా వద్దు: ఢిల్లీ రైతుల పట్టు
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా 50 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో సాగుతున్న రైతుల పోరాటానికి ఒక పరిష్కారం కొనుగొనేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి మొదటి దెబ్బ తగిలింది. ఈ నలుగురు సభ్యుల కమిటీ నుంచి భూపిందర్ సింగ్ మాన్ (భారతీయ కిసాన్ యూనియర్ అధ్యక్షుడు) వైదొలిగారు.
మిగతా ముగ్గురు ( డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, డాక్టర అశోక్ గులాటి, అనిల్ గణ్వత్) కూడా తమకు అవసరం లేదని ఆందోళన చేస్తున్న రైతుల సంస్థ ‘భారతీయ కిసాన్ యూనియన్ లోక్ శక్తి’ శనివారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
రైతుల డిమాండ్ కు సుప్రీం కోర్టు తలొగ్గుతుందేమో చూడాలి. సుప్రీంకోర్టు తనకు తాను కేంద్ర చట్టాలు అమలు కాకుండా స్టే ఇచ్చిన ఈ కమిటీ వేసింది.
ఈ నలుగురు కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను సమర్థిస్తూ వ్యాసాలు రాశారని, ఇలా చట్టాల మీద ఒక అభిప్రాయంతో ఉన్నవారిని చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనను పరిశీలించి నివేదిక ఇవాలని సుప్రీకోర్టు అగడం వల్ల న్యాయంజరగదని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సంస్థ తరఫున లాయర్ ఎపి సింగ్ మిగతా ముగ్గురు సభ్యలను కూడా తొలంగించి వారిస్థానంలో ఇరు పక్షాలకు విశ్వసనీయులైన సభ్యులతో కమిటీ వేయాలని కోరారు.
“It is important to mention here with regret that the principle of natural justice is going to be violated by making these persons as members of the committee…. How they will hear all farmers on the equal parameters when they have already supported these laws,” అని పిటిషన్ లో పేర్కొన్నారు.
పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లకు చెందిన వేలాది రైతులు హర్యానా-ఢిల్లీ సమీపంలోని సింఘూ సరిహద్దు గుడారాలు వేసుకుని 50 రోజులుగా కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వస్తున్నారు. ఈ మూడు చట్టాలేవంటే… 1. Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation)Act, 2) The Essential Commodities (Amendment) Act, 3) Farmers (Empowerment and Protection)Agreement on Price Assurance and Farm Services Act.
ఈ చట్టాలను కేంద్రం 2020 సెప్టెంబర్ రూపొందించింది. ఈ చట్టాలు అమలులోకి వస్తే ఇపుడు రైతులకు అండగా ఉంటున్న కనీసం మద్దతు ధర మాయమవుతుందని, కొత్తగా అమలులోకి వచ్చే మండి వ్యవస్థ (wholesale market) తో రైతులంతా కార్పొరేట్ కంపెనీ దయాదాక్షిణ్యాల మీద ఆధార పడాల్సి వస్తుందని రైతులు వాదిస్తూ వస్తున్నారు. అందుకే ఈమూడు చట్టాలను ముందు వాపసుతీసుకోవలసిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్రం ఈ చట్టాలను వాపసుతీసుకునేది లేదని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో చట్టాలను పరిశీలించిరైతులకు నిజంగా అన్యాయం జరుగుతుందా అనేదాన్ని రైతులతో మాట్లాడి ఒక నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన వున్న ధర్మాసనం ఈ నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది.