సంక్రాంతి పండుగ సందర్భంగా రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సీమ ముగ్గుల పోటీలలో విజేతలను వేదిక అధ్యక్షుడు డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పోటీల సమన్వయకర్త యస్. వాసంతి శనివారం ప్రకటించారు.
యాభై మంది దాకా పోటీలలో పాల్గొనగా , అందులోని విజేతలకు మొత్తం మూడువేల రుపాయలు ఈ సందర్భంగా అందచేస్తున్నామని ప్రకటించారు.
ప్రథమ బహుమతి పి. శకుంతలమ్మ , చెన్నై, వేయి రూపాయలు,
ద్వితీయ బహుమతి సి.కోమల,ధర్మవరం, ఏడువందల రుపాయలు,
తృతీయ బహుమతి ప్రభావతి, అనంతపురము, ఐదువందల రుపాయలు అందుకొన్నారు.
ప్రోత్సాహక బహుమతులను బి.జీవనజ్యోతి, కదిరి
కె.జయప్రియ, అనంతపురము, చింతల వెంకటేశ్వరి, గడిగరేవుల
కె. రామలక్ష్మి, అనంతపురము అందుకున్నారు.
రాయలసీమ సాంస్కృతిక, సామాజిక జీవన స్థితిగతులను ఈ ముగ్గులు అద్దం పడతాయని, భవిష్యత్తులో సీమ సాంస్కృతిక వికాసానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, సీమ ముగ్గులను పుస్తకంగా వెలువరిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహాక బృందంలో నిర్మల, సునీత, అమరావతి, లలితకుమారి, లక్షీకాంత, శైలజ తదితరలున్నారు.