లండన్ లో కుర్ర గాంధీ షోకులు, సరదాలు ఇవే…

లండన్ లో లా చదువుకునేందుకు వెళ్లిన గాంధీ, అందరి కుర్రాళ్లలాగే చాలా వేషాలు వేశాడు. లండనర్ కావాలనుకున్నాడు.లండన్ జంటిల్మన్ గా కనబడేందుకు ఏంచేయాలో అవి చేసేందుకు వెనకాడలేదు.

అయితే, తను వచ్చిన పని పూర్తి  చేసుకోవడం కాకుండా మరో దారిలో వెళ్లతున్నానని అనుమానమొచ్చింది.  అమ్మో ఇలాంటి వేషాలు, సరదాలు  మంచిది కాదు, మనం వచ్చింది చదుకునేందుకు, అందువల్ల చదువే  మొదటి ప్రయారిటీ అని చాలా ప్రయోగాల తర్వాత తెలుసుకున్నాడు.

ఎక్కడో పోర్ బందర్ అనే ఇండియన్ పల్లెటూరి నుంచి  వచ్చి ప్రపంచ రాజధాని అయిన లండన్ లో పడ్డాడుగా.  అందుకే మొదట ఇంగ్లీష్ జంటిల్ మన్  లండనర్ కావాలనుకున్నాడు.మొదట వెస్టర్న్ డ్రెస్ కొన్నాడు.  లండన్ లో  బాండ్ స్ట్రీట్ లో  పేరున్న షాపులన్నీ తిరిగి ఒక హ్యాట్, డ్రెస్ కొన్నాడు.

ఈవెనింగ్ షూటూ కొన్నాడు. పాకెట్ వాచ్ కు తగిలించుకునేందుకకు ఒక చెయిన్ పంపమని ఇండియాలో ఉన్న సోదురుడి లేఖ రాశాడు. ఆయన జానెడ్ చెయిన్ అడిగితే, ఆయన మూరెడు ప్యూర్ గోల్డ్ చెయిన్ పంపాడు.  ఇప్పటికి అప్పియరెన్స్ లో లండన్ జెంటిల్ మన్ లాగా తయారయ్యాడు. మరి కల్చరో…

కల్చరల్ గా కూడా వెస్టర్న్ జంటిల్మన్ లాగా నడుచుకోవాలని సరదా పడ్డారు. అపుడు లండన్ లో అంతో ఇంతో నాగరికంగా ఉండేవాళ్లందరికి డ్యాన్స్ తెలుసు. కాబట్టి తాను డ్యాన్స్ నేర్చుకుని తీరాలి. అంతేకాదు, యూరోప్ లో పెద్దవాళ్లంతా మాట్లాడే భాష ఫ్రెంచ్. అదీ నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకుంటే తాను పూర్తిగా నైస్ గా, లండన్ జంటిల్మన్ అయిపోతాడు.

మొదట డ్యాన్స్ నేర్చుకునేందుకు ఒక ట్యూటర్ దగ్గిర చేరాడు. దీనికి మూడు పౌండ్ల ఫీజు కూడా కట్టాడు. మూడు వారాలు గడిచారు.ఆరుపాఠాలా దాక క్లాస్ నడిచాయి. అయితే, బీట్ కు అనుగుణంగా పాదాలు పడటమే లేదు. పాదాల దారొకవైపు, మ్యూజిక్ బీట్ మరొక వైపు.  క్లాస్ లో పియానో వాయించినట్లు డ్యాన్స్ చేయాలి. కుదర్లేదు. కాళ్లు పియానో మాట వినడమే లేదు. ఎలా? ఒక ఆలోచన వచ్చింది.డ్యాన్స్ బదులు ముందు పియానో నేర్చుకుంటే పోలా?

అదే చేశాడు మన గాంధీ. పియానో పాఠాలు మొదలయ్యాయి. ఈ పాఠాలు పూర్తయితే, డ్యాన్స్ లో కాళ్లు పియానో మాట వింటాయనుకున్నాడు. మూడు పౌండ్లు పెట్టి పియానో కొన్నాడు. పియానో క్లాసులకు మరి కొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఊహూఁ,పియానో కూడా మాట వినడం లేదు.

ఈ లోపు మరొక ఆలోచన వచ్చింది. మంచి వక్త కావాలనుకున్నాడు. ఆ రోజుల్లో బాగా ఫ్రెంచ్ దట్టింది, ఇంగ్లీష్ లో లెక్చర్లు దంచే వాళ్లకు సొసైటీలో మాంచి గౌరవముండేది. లండన్ జెంటిల్మన్ అయ్యేందుకు ఈ సారి ఎలక్యూషన్ టీచర్ ను ఏర్పాటుచేసుకున్నాడు. ఫీజు చెల్లించాడు. పర్సానాలిటి డెవెలప్ మెంటు పుస్తకాలను ఇప్పటి కుర్రవాళ్లు ఎలా కొంటున్నారో తెలుసుగా. ఆరోజు కూడా పర్సనాలిటి పదును పెట్టుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు. డేవిడ్ చార్లెస్ బెల్ (David Charles Bell మే 4 1817-28 అక్టోబర్ 1902) రాసిన Standard Elocutionist అనే పుస్తకం కొన్నాడు. ఈబెల్  గ్రాహంబెల్  బాబాయ్. ఆ రోజుల్లో ఆయన బాగా పేరున్న ఎలొక్యూషన్ ప్రొఫెసర్. ఇలాంటి ప్రయత్నాల మధ్య లో ఆయన మెదడులో వార్నింగ్ బెల్ మోగింది. తాను లండన్ వచ్చింది ఎందుకు? తాను చేస్తున్నదేమిటి? తాను వచ్చింది చదువునేర్చుకునేందుకు గాని, లండన్ జంటిల్మన్ అయిపోయి ఇక్కడ స్థిరపడేందుకు కాదుగా!  ఈ వెస్టర్న్ డ్యాన్స్ నేర్చుకుని, పియానో నేర్చుకుని ఇండియాకు తిరిగిపోయేదెట్లా? తాను లండన్ కువచ్చింది విద్యార్థిగా. విద్యార్జన తన ధ్యేయం కావాలి. ఈ సరదాలు,ఈ షోకులు కాదు అని ఆలోచించారు. తను లండన్ లో సంపాదించాల్సిందంతా ఒక్కటే… చదువు.

ఈ ఆలోచన రాగానే, ఎలక్యూషన్, డ్యాన్స్, పియానో టీచర్లు లేఖ రాశాడు. వయెలిన్ టీచర్ కు ఇచ్చేశాడు.ఆమె దీనిని అమ్మిపెడతానని మాట ఇచ్చింది. ఇలాగే మిగతా టీచర్లు కూడా ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నారు. ఇలా వెస్టర్నకల్చర్ గ్రిప్పులో మూన్నెళ్లు సతమతమయ్యాడు. తర్వాత విజయవంతంగా బయటకువచ్చాడు. అయితే, పాశ్చాత్యడ్రెస్ మీద మోజు చాలా కాలం ఉండింది. ఈ షోకులను,సరదాలను జయించి, చివరకు గాంధీ ఉత్తమ బాలడుయిన చక్కగా చదువుకున్నాడు…

(ఈ విషయాలన్నీ గాంధీ మీద వచ్చిన తాజా పుస్తకం Restless as Mercury, My Life as a Young Man లో ఉన్నాయి.)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *