దేశ రాజధాని ఢిల్లీలో చికెన్ బ్యాన్ చేశారు. రాజధానిలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కనిపించడంతో నగరంలోని రెస్టరెంట్లలో ఎలాంటి చికెన్, కోడిగుడ్ల వంటకాలు విక్రయించరాదని ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దుకాణాలకు కూడా ఈ బ్యాన్ వర్తిస్తుందని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (NDMC) ఉత్తర్వులలో పేర్కొంది.
బర్డ్ ఫ్లూ గురించిన సమాచారం అందినప్పటినుంచి ఢిల్లీలో ఉన్న మూడు మునిసిపల్ కార్పొరేషన్ లలో చికెన్ వాడకం మీద ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఢిల్లీలోని అతి పెద్ద చికెన్ మార్కెట్ ఘాజిపూర్ మార్కెట్ ను మూసేశారు.
చికెన్ దుకాణాలు, పౌల్ట్రీషాపులు, రెస్టరెంట్లు ఏవీ కూడా చికెన్ ను విక్రయించడం, చికెన్ వంటకాలు వడ్డించడం చేయరాదని ఎన్ డిఎంసి పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే దాకా ఈ బ్యాన్ అమలులో ఉంటుంది.