తెలంగాణ లో దాదాపు 9నెలల నుండి మూత పడి ఉన్న హాస్టళ్లు, స్కూల్స్ తెరచుకునేందుకు రంగం సిద్ధమవుతున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ నెల 25వ తేదీలోగా విద్యార్థులకు అందుబాటులో ఉండబోతున్నాయి.
సన్నబియ్యంతో పాటు పప్పు, ఉప్పులు, నూనె, ఇతర రేషన్ సరుకులను అందుబాటులో ఉ ంచడమే కాకుండా శానిటేషను ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
జనవరి 26వ తర్వాత హస్టళ్ళల్లో వసతులపై మంత్రులు శాసన సభ్యులు తనిఖీలు నిర్వహిస్తారు. కలెక్టర్లతో ఈ నెల 18వ తేదీ తర్వాత విడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.
రాష్ట్రంలో మొత్తం 700 బిసి హాస్టళ్లలో 12,856 మంది విద్యార్థులు 9,10 తరగతులు చదివుతున్నారని, 12,858, ఇంటర్ ఆ పై తరగతులు 30,827 మంది విద్యార్థులు, 141 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9 తరగతి నుంచి పిజీ వరకు 27,298 మొత్తం 70,983 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9,10 ఇంటర్, డిగ్రీ, బీటెక్ తదితర తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బిసి హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాట్లను మంత్రి కమలాకర్ మంగళవారం నాడు తన కార్యాలయంలో బి.సి. వెల్ఫేర్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభించాలని ముఖ్యంగా శానిటేషన్ పై ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. కరోనా నిబంధనలకు తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులకు మాలు, శానిటేజర్లను అందుబాటులో ఉంచాలని అన్నారు.
సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు పౌరసరఫరాల సంస్థ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. ప్రతినెల 8,500 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయి.
ప్రస్తుత పౌరసరఫరాల సంస్థ దగ్గర ఇందుకు కావాల్సిన బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. దాదాపు 74వేల మెట్రిక్ టన్నులు సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 25వ తేదీలోగా గోదాముల నుండి హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు రవాణా చేయాలని మంత్రి సూచించారు.