(వడ్డే శోభనాద్రీశ్వర రావు)
కేంద్రం తీసుకు వచ్చిన ముూడు వ్యవసాయ చట్టాలను పరిశీలించేందుకు రోజు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కమిటీ వేశారు.
ఈ మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు 48రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరితో ఉంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కమిటీని నియమించారున
అయితే, ఈ కమిటీ వలస రైతులకు ఎంతమాత్రం మేలు చేకూరదు.
కమిటీ లోని నలుగురు సభ్యులు ఈ మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు అనుకూలురు.
ప్రపంచ ప్రసిద్ది వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త,భారత దేశంలో సస్యవిప్లవం నకు బాటవేసిన డాక్టర్ యం.యస్.స్వామినాథన్ గారు లేకుండా కార్పొరేట్ సంస్థల మిత్రులను కమిటీ లో నియమించడం పొరపాటు.
నిష్పక్షపాతంగా,రానురాను దిగజారూతున్న రైతాంగం పరిస్థితులు పైన సమగ్ర అవగాహన వున్న వారిని వదిలి,రైతులు ఏమైపోయినా పర్వాలేదు కాని, స్వేచ్ఛావాణిజ్యం ముసుగులో రైతులు,వినియోగదారుల ను అడ్డగోలుగా దోపిడీ చేసే కార్పొరేట్ సంస్థల మిత్రులను కమిటీ సభ్యులుగా నియమించడం సరికాదు. ఇలాంటి చర్యల వల్ల సమస్య పరిష్కారం కాక పోగా జటిలమయ్యే అవకాశం కన్పిస్తోంది.
ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధం చెప్పడం సిగ్గు చేటు .
(వడ్డే శోభనాద్రీశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయమంత్రి, రైతుల హక్కుల పరిరక్షణ ఉద్యమకారుడు)