గొప్పవాళ్లు ఆకాశంలోంచి ఊడి పడరు, తెలుసా?

(పిళ్లా కుమారస్వామి)

బ్రతుకు పూలబాట కాదు
అది పరవసించి పాడుకునే పాటగాదు….అనే పాట మీరు వినే వుంటారు.

జీవితం విరిపాన్పుకాదు. అది వడ్డించిన విస్తరికాదు. అందులో ముల్లుంటాయి. రాల్లుంటాయి.

మధ్యలో అక్కడక్కడ ఎడారిలో ఒయాసిస్సులా కొన్ని పూలు వికసించొచ్చు.

జీవితం ఒక వంకరటింకరమార్గం. అనేక మలుపులుంటాయి. జాగ్రత్తగా వెళ్లాల్సిందే.

జీవితం ఒక వంకరటింకర శిల.దాన్ని శిల్పంలా మనకు మనమే చెక్కుకోవాలి.

కొన్ని కలలు, కొన్ని నమ్మకాలు, కొంతబాధ, కొంత సంతోషం, విజయాలు, వైఫల్యాల సమాహారమే జీవితం. జీవితం బ్రాంతికాదు. అది రంగులకల అంతకన్నా కాదు. జీవితం ఒక సాహసం, అదొక అనుభవం, అనుభవాల పరంపరే జీవితం. అనుభవాలనే నిఘంటువులో ప్రతి వ్యక్తి జీవితం ఒక పేజీ లాంటిది.

ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలని పై స్థాయిలో వుండాలని అందరి కన్నా ఒక మెట్టులో వుండాలని, ఏదో ఒక రంగంలో రాణించాలని కలలు కనేవుంటారు. విజయం కోసం తపన పడే వుంటారు.

ఎవరైతే నేను చేయగలనన్న ఆత్మవిశ్వాసం కలిగివుంటారో,
ఎవరైతే ఎవ్వరూ తోడురాని సమయల్లో కూడా ఒంటరిగా ముందుకు వెళ్లగలరో, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎవరైతే ఎదురుచూడరో
వారే తమ విజయాన్ని సాధించగలుగుతారు.

అందుకే మహాకవి శ్రీ శ్రీ అంటాడిలా.

పదండి ముందుకు
పదండి త్రోసుకు
నదీనదాలు
కొండలు, లోయలు
ఎడారులా
మనకడ్డంకి?

జీవితంలో విజయం సాధించదలచుకున్న వ్యక్తి ఓపిగ్గా తాను సాధించదలిచిన లక్ష్యం వైపు పని చేస్తూ పోవాలి. ప్రతి నిమిషం విలువైనది.
ప్రతి నిమిషం గమ్యం పైపు నడవడమే విజయానికి సోపానం. ఇందులో ప్రధాన సూత్రాలు కొన్ని వున్నాయి.

ప్రధానంగా అవి :

1. Do it now – ఇప్పటి పనిని ఇప్పుడే అయిపో చేయాలి. “వాయిదా పద్దతుంది. దేనికైనా” అనే ఆలోచనను వదిలేయాలి.

2 సోమరిగా వుండరాదు. రేపు చేద్దాం లే అని అను కోరాదు. ఎప్పుడూ మనం సాధించదలచుకున్న రంగానికి సంబంధించిన పనిలో ఏదో ఒకటి చేస్తూ వుండాలి.

3. ఒంటరిగా నైనా గమ్యం చేరుకోవటానికి సిద్ధంగా వుండాలి. ఎవరో ఒకరి తోడుకై ఎదురు చూస్తూ కూర్చోరాదు.

4.విజయాన్ని సాధించాలన్న తపన, సాధించ గలనన్న ధీమా తనపై తనకు వుండాలి.

I am the winner
I am the captain of my soul
I can never be defeated

అని పదేపదే మనస్సులో అనుకోవాలి.

I conceive, I belive, I practice, I achieve అని తరచూ మనస్సులో పదేపదే అనుకోవాలి.

పై అలోచనలన్ని మెదడులో కెక్కుంచుకుంటే మన మెదడు ఆలోచించేటప్పుడు పని చేసేటప్పుడు
మెదడు ఆ ఆలోచనలతో పని చేయడం మొదలుపెడుతుంది.

Doing is very good but that comes from thinking, Little manifestations of energy through the muscles are called work. But where there is no thought, there will be no work. Fill the brain, therefore, with high thoughts highest ideals, place
them day and night before you, and out of that will come great work: Swamy Vivekananda

జీవితంలో ఏ రంగంలో తాను రాణించ దలచుకున్నా ఆ రంగంలో తనకున్న సామర్థ్యాన్ని, అవకాశాల్ని, తెలివితేటల్ని, అంతర్గత శక్తుల్ని గుర్తించాలి.
అనుకరించడం తప్ను లేదు. కాకపోతే కొంతకాలం తరువాత స్వంత మార్గం చూసుకోవాలి. కొత్తదనాన్ని స్వీకరించాలి. సృజనాత్మకత అవసరం. స్వంత అనుభవాల్ని సమీకరించుకోవాలి.

ప్రతిసారి మన పనిని సరిచూసుకోవాలి. అంతర్గతంగా మనస్సు సూచించే దారుల్లో పయనించాలి. పనికిఫలితానికి గల సంబంధాన్ని గుర్తించాలి.
ప్రయత్నం మొదటి మెట్టు, ఫలితం రెండవది. ప్రతి ప్రయత్నమొక ఆరంభం. ప్రతి వైఫల్యం ప్రయత్నానికి ఆలంబన. విజయానికి దారిచూపే దిక్చూచి. కష్టపడి పనిచేసే వ్యక్తికి వైఫల్యాలు సాఫల్యతా మార్గాన్ని చూపిస్తాయి. అందుకే కెరటాలకు తలవంచితే నావ పయనించగలదా? గాలిపటం ఎదురుగాలిలోనే కదా బాగా ఎగురగలిగేది! ఎన్ని ఆటంకాలొచ్చినా, వడివడిగా సాగటమే ధీరోదాత్తుల లక్షణం.

Never mind failures; they are quite natural, they are the beauty of life. What would life be without them? Hold the ideal a thousand times and if you fail a thousand times, make the attempt once more:  Swamy Vivekananda

ప్రసిద్ధులైన వారెన్నడూ ఉన్నట్లుండి ఆకాశంలోంచి ఊడిపడలేదు. అది వరం అంతకన్నా కాదు.

పనిని వారు తమబానిసగా చేసుకున్నారు. కాలానికి కళ్ళెం వేసి, విజయంపై స్వారీ చేశారు. తోటివారు నిద్రిస్తున్న సమయంలో వీళ్ళు మేల్కొని అకుంఠిత దీక్షతో శ్రమ పడ్డారు. వెనుతిరిగి చూడక, అవిశ్రాంతంగా ముందుకు పోగలిగారు. సాధించిన దానితో సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయ్ అన్నాడో సినీకవి.

చిన్న చిన్న విజయాల్లో తృప్తినొందక, తాము ఆశించిన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే విజయం సాధించినట్లుగా భావించాలి. సాధారణ మానవులు చిన్న విజయాలకే సంతృప్తి చెందుతారు. విజేతలు గమ్యం చేరేదాకా విశ్రమించరు. లక్ష్యసిద్ధి కోసం జీవితాన్ని అంకితంచేసుకుంటారు. అందుకే వారిని మహనీయులుగా సమాజం గానం చేస్తుంది.

Pilla Kumaraswamy

(పిళ్లా విజయ్ కుమార్ , రచయిత, విమర్శకుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *