ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమావేశం ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగింది.
9వ తరగతి నుంచి ఆ పై తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే తరగతులు మొదటి విడతలో ప్రారంభమవుతాయి. విద్యార్థులంతా హాజరు కావలసి ఉంటుంది
ఎస్సీ, మైనారిటీ,దివ్యాంగులకు చెందిన సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు,కళాశాలలు కూడా తిరిగి తెరుచుకుంటాయి,తరగతులు ప్రారంభమవుతాయి
కోవిడ్ నిబంధలను కచ్చితంగా పాటించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు,ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు అవసరమైన వసతులు, జాగ్రత్తలు తీసుకోవాలి
ఈ మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు,విభాగాధిపతులను ఆదేశించడం జరిగింది.