తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది క్షేత్రం పేరు ఇపుడు రోజూ వార్తల్లో ప్రత్యక్షమవుతూ ఉంది. అంతర్వేది లక్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన రథాన్ని దుండగులు నిప్పుపెట్టి బూడిదపాలుచేయడంతో అంతర్వేది వార్తలకెక్కింది. తర్వాత పోలీసు కేసులు, కొత్త రథం యుద్ధ ప్రాతిపదికన తయారుకావడం… ఇది పెద్ద రాజకీయ వివాదం.
ఈ నేపథ్యంలో అంతర్వేది ఆలయానికి జాతీయగుర్తింపు వచ్చింది. అయితే, ఈ ఆలయం వెనక చాలా అసక్తికర కథనాలున్నాయి.
నవ నరసింహ క్షేత్రాలలో ఒకటయిన అంతర్వేది ఆలయం వెనక పౌరాణిక కథల గురించయితే అందరికీ తెలిసిందే. అయితే, కొన్ని విశ్వాసాలు, చారిత్రక విషయాలు, చాలా మందికి తెలియదు. మరుగున పడి ఉన్నఅంతర్వేది చరిత్రను ఇపుడు చూద్దాం.
ఆలయం రథోత్సవం గురించి ఆసక్తికరమయిన కథ ఒకటుంది. ఇది గోదావరి గెజిటెర్ లో రికార్డు చేశారు.
“లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం నాడు అంతర్వేది పక్కనున్న పేరూరుకు చెందిన ద్రవిడ బ్రాహ్మణులు పెళ్లి కూతురు పక్షాన నిలబడటం ఆనవాయితీ. అంతర్వేది బ్రాహ్మణులు పెళ్లికొడుకు పక్షాన నిలబడతారు. ఆరోజు ద్రవిడ బ్రాహ్మణులు అంతర్వేది లోని బ్రాహ్మణులను నానా విధాలుగా ఎగతాళి చేసేందుకు అనుమతిస్తారు. రథోత్సవాల ముగింపునకు ముందురోజు ఈ ఎకసక్కెం తీవ్రమవుతుంది. ద్రవిడ బ్రాహ్మణులు వైష్ణవ నామాలు ఎగతాళిగా పెట్టుకుని వైష్ణవ బ్రాహ్మణులను బాగా తిడుతూ పాటలు పాడతారు. అయితే ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఎందుకు?తమిళబ్రాహ్మణులు ఇలా అంతర్వేది బ్రాహ్మణులను అల్లరిపెట్టేందుకు కారణం ఏమిటి? దీని వెనక సంఘటన ఉంది.చాలా కాలం కిందట విష్ణుదేవుడు సముద్రంలో తన చక్రాన్ని పొగొట్టుకున్నాడు. అపుడు పేరూరు కు చెందిన తమిళ బ్రాహ్మణుడొకాయన గట్టిగా మంత్రాలు చదవి చక్రాన్ని బయటకు తీశాడు. దీనితో అంతర్వేది బ్రాహ్మణులు పేరూరువారికి రుణపడాల్సి వచ్చింది. అప్పటినుంచి పేరూరు బ్రాహ్మణులకు అంతర్వేది ఉత్సవాలలో పెద్ద పీట. చివరకు పేరూరుబ్రాహ్మణులు లేకపోతే, రథం కూడాముందుకు కదలని పరిస్థితి వచ్చింది. విజయనామసంవత్సరం (1893-1894) మరొక సంఘటన జరిగింది. ఆయేడాది రథోత్సవం నాడు రథం ఎందరు గుంజినా ముందుకు కదలడం లేదు. కారణం రథం లాగుతున్నవారిలో పేరూరు ద్రవిడ బ్రాహ్మణులెవరూ లేరు. ఈ విషయం తెలుసుకున్న ఆలయం వారు వెంటనే అక్కడున్న వారిలో పేరూరు బ్రాహ్మణులుంటే వచ్చి రథం తాళ్లనుతాకి, లాగాలని పిలిచారు. అంతే వారు వచ్చి తాళ్లను తాకారో లేదో రథం ముందుకు కదిలింది. అప్పటినుంచి ఇప్పటిదాకా పేరూరు వాళ్లెవరూ లేకుండా రథయాత్ర సాగదు.”
(When the marriage of this god is performed they (Dravida Brahmans of Peruru-a village about 5 miles from Amalapuram) represent his bride’s relations, and they are also allowed to go to considerable lengths in making fun of the Sri Vaishnavite Brahmans of Antervedi, who are the leading religious party in the place and represent the god himself at the marriage. On the last day but one of the festival they put on Vaishnavite sect-marks and sing abusive songs about the Vaishnavites, who show no resentment. The reason for all this is said to be the fact that long ago the chakram of the god was lost in the sea, and that one of the Tamil Brahmans of Peruru earned
the everlasting gratitude of the people of Antarvedi by getting it back by the use of powerful charms (mantrams). It is even believed that the car cannot be drawn without the help of one of these privileged persons. It is solemnly asserted that ‘in the year Vijaya’ (1893-94) the villagers could not move the car in spite of all their efforts, because no one from Peruru was pulling. Some men from
there were sought out and prevailed upon to touch the ropes, and the car at once started, and nowadays they take care to have someone from Peruru to help pull.”) (source: 1961 Census Report)
సంతానం లేని మహిళలు లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నాడు ఆలయం వెనక నిద్ర చేస్తారు. ఆ మహిళలకు కలలో చేట, పొరక కనిపిస్తే వారి సంతానం కలగదు. అలాకాకుండా కలలో పూలు, పళ్లు, ఆటబొమ్మలు, దోసకాయలు కనిపిస్తే వారికి సంతానం కలుగుతుందని ప్రజల నమ్మకం.
చరిత్ర
1. అంతర్వేది ఇపుడు చిన్న వూరు గాని, ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో ఏర్పాటుచేసుకున్న మొట్టమొదటి రేవు అంతర్వేదియే. ఇక్కడి నుంచే కంపెనీవాళ్లు స్వేచ్చగా ఎగుమతులు,దిగుమతులుచేసుకున్నారు.
2. అంతేకాదు, డచ్ వాళ్లకు కూడా ఇదే ఒడరేవు. ఆనాటి ఒడరేవుకు సంబంధించిన నిర్మాణాలు 1950 దాకా కనిపిస్తూ ఉండేవి. అయితే, ఒకసారి సముద్రం ఉప్పొంగడంతో అక్కడి అంజనేయస్వామి దేవాలయంతో పాటు ఒడరేపు పాత కట్టడాలు కూడా సముద్రంలో కొట్టుకుపోయాయి. ఆరోజులో డచ్చివారు పక్కనే ఉన్న నర్సాపురంలో అదనంగా భవనాలు కట్టుకున్నారు.
3. క్రీ.శ 1700 లో ఈ ప్రాంతాన్ని శ్రీ రంగరాజ నృపతి పాలించేవాడు.అపుడాయన రాజధాని మొగల్తూరు. అపుడే గొల్కొండ నవాబు రుస్తుం ఖాన్ ను రుస్తుంబాద్ ప్రతినిధిగా, ఆయన కుమారుడు హసన్ అల్లీని హసనాబాద్ ప్రతినిధి పంపించాడు.
4. గొల్కొండ నవాబు తానేషా భద్రాద్రి రాముడికి భక్తుడయినట్లే రుస్తుం ఖాన్, హసన్ అలీలు కూడా ఇక్కడి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి భక్తులయ్యారు. కొంతకాలం తర్వా ఇక్కడొక సంఘటన జరిగింది.
5. రంగరాజ నృపతి కొడుకు రామరాజ వరేణ్య అనుకోని పనిచేశాడు. రాజ్యం వదిలేసి ఎటో వెళ్లిపోయాడు.కుమారుడు రాజ్యం వదలిపారిపోయిన బాధతో, వయోభారాన్ని కూడా లెక్క చేయండా రంగరాజ నృపతి రామరాజ వరేణ్యను వెదుక్కుంటూ వెళ్లిపోయాడు.
6. ఇదే అదను గా తీసుకుని రుస్తుం ఖాన్ రంగరాజ నృపతి ఏలుబడిలో ఉన్న భూభాగాన్ని కభళించాలనుకున్నాడు. అయితే, దీనికి ఆయన కుమారుడు హసన్ అల్లీ అంగీకరించలేదు.ఇలా చేయకూడదని తండ్రి మీద ఎదురుతిరిగాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఇందులో తండ్రిని ఓడించి, రాజ్యం నుంచి తరిమేశాడు.
7.తర్వాత, అంతర్వేది పెద్దాపురం గజపతి రాజుల ఏలుబడికిందికి వచ్చింది.
8. 1814లో బ్రిటిష్ వాళ్లు పెద్దాపురం మీద దాడి చేసి స్వాదీనం చేసుకుని మళ్లీ మొగల్తూరు రాజకుటుంబానికి అప్పగించారు. అపుడే అంతర్వేది ఆలయానికి కలిదిండి కుమార లక్ష్మి నరసింహ రాయబహదూరు ధర్మకర్తఅయ్యారు.
9. అంతర్వేది ఆలయాన్ని ఎపుడో పల్లవులు కట్టించారని చెబుతారు. దాానికి సంబందించిన చారిత్రాకాధారాలు లేమీ ఇంతవరకు లభ్యం కాలేదు. అది సముద్రంలో కలిసిపోయిందని, తర్వాత భక్తులంతా కలసి మరొక ఆలయాన్ని కట్టించారని నేటి ఆలయం దక్షిణ వైపున ఉన్న గోడ మీద ఉన్నశాసనంలో ఉంది.
10. ఈ శాసన ప్రకారం 1823 స్వాభాను తెలుగు సంవత్సరం చైత్ర బహుళ దశమి నాడు (ఆదివారం) ఈ ఆలయం నిర్మాణం జరిగింది.తెలుగు రాష్ట్రాల్లో నరసింహ స్వామి ఆరాధన చరిత్రతెలుగు రాష్ట్రాల్లో రాముడు,కృష్ణుడు తర్వాత ఎక్కువ కనిపించే పేరునరసింహుడిదే. తెలంగాణ, ఆంధ్రప్రాంతాలలో నరసింహస్వామి అధారాన (cult of Lord Narasimha) చాలా ఎక్కువ ఉండటమే దీనికి కారణం. నరసింహ స్వామి ఆరాధన ఉత్తర భారతంలో తక్కువ. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం,నరసింహస్వామి (విష్ణుదేవుని దశావతారాల్లోఒకరు) ఆరాధన రాయలసీమలో అహోబిలం లో మొదలయిందని అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు విస్తరించిందని చెబుతారు. అందుకే లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాలలో తెలుగు నాట అంత్యంత పురాతనమయినది కర్నూలు జిల్లాలోకి అహోబిలం. నరసింహస్వామికి సంబంధించిన ప్రముఖమయిన ఆలయాలుండేది తెలంగాణ, ఆంధ్రలోనే.