తెలుగు దేశం మాజీ మంత్రి, భూమా ఆఖిల ప్రియకు బెయిల్ దొరక లేదు. హైదరాబాద్ లో భూ తగాదాలకు సంబంధించి ఒక వ్యక్తిని కిడ్నాపు చేసిన కేసులో భర్త, మరిది, మరికొందరితో కలిపి ఆమె ముద్దాయి ఎ వన్. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆనారోగ్యం, గర్భవతి అని చెప్పి బెయిల కోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే, అఖిల ప్రియ కు సికింద్రాబాద్ కోర్టు ఆమె బెయిల్ దరఖాస్తును కొట్టి వేసింది. అంతేకాదు, మూడోరోజుల పోలీసు కస్టడీకి పంపించింది.
ఈరోజు నుండి ఈ నెల 13 వరకు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది.