సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ దేవాలయాలు దూపదీప నైవేద్యలతో మహర్దశను సంతరించుకున్నాయని ఆర్థిక మంత్రి టి హరీష్ రావు వ్యాఖ్యానించారు. దీని వల్ల దేవతల ఆశీస్సులతో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజక్టులు సాగుతున్నాయని ఆయన చెప్పారు.
‘గత సంవత్సరం మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రాజెక్టులన్నీ పూర్తికావాలని మొక్కుకున్నం. మల్లన్న దయవల్ల ప్రాజెక్ట్ లాన్ని విజయవంతంగా పూర్తయయ్యాయి.
ఉత్తరాన రంగనాయక సాగర్,దక్షిణాన కొండపోచమ్మ సాగర్,మధ్యలో మల్లన్న దేవాలయనికి గోదావరి జలాలు చేరుకున్నాయి,’ అని హరీష్ అన్నారు.
తెలంగాణలో నిర్మించిన ప్రతి ప్రాజెక్ట్ కు దేవుళ్ళ పేర్లు పెట్టి వారి ఆశీర్వాదంతో త్వరతగతిన పూర్తి చేసుకుంటున్నామని హరీష్ వ్యాఖ్యానించారు.
మల్లన్న కళ్యాణములో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు కల్యాణం నిర్వహించడం సంతోషకరమనిఆయన ప్రశంసించారు.
హరీష్ రావు ఈ రోజు సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం మల్లన్న దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడురు. ఆయన వెంబడి కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలో మల్లన్న సాగర్ పూర్తిచేసి ఈప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసుకుందామని హరీష్ రావు అన్నారు.