కేంద్రం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు తెలంగాణా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిసిపి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు:
1. రేపు జనవరి 9న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గిర ధర్నా చౌక్ లో సీఎల్పీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి ధర్నా.
2. జనవరి 10వ తేదీన టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా భవన్ లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం.
3. జనవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు డీసీసీ ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ల ముందు ధర్నాలు.