ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్…. రిక్రూట్ మెంట్ మొదలయింది!

దేశంలో ఫ్రెషర్స్ రిక్రూట్ మెంట్ మొదలయింది.పుంజుకుంటూ ఉంది. కోవిడ్ తో అల్లాడి పోయిన ఫ్రెషర్స్ కి మంచిరోజులుమొదలయ్యాయి. అన్ లైన్ రిక్రూట్ మెంట్ విధానంలోకంపెనీలు ఫ్రెషర్స్ ను తీసుకోవడం మొదలుపెట్టారు. జాబ్ పోర్టల్స్ జాబ్ పోస్టింగ్స్ బాగా పెరిగాయి.

గత మూడు నెలలతో పోలిస్తే ఇపుడు ఫ్రెషర్స్ జాబ్ రిక్రూట్ మెంట్ 300 శాతం పెరిగింది. Freshersworld.com వైఎస్ ప్రెశిడెంట్ కౌశిక్ బెనర్జీ చెబుతున్న  సమాచారం ప్రకారం ఐటి, ఇ-కామర్స్, ఫైన్ టెక్,ఎజ్యు టెక్ , ఆటో,  ఆటోరంగంలో ఇవి సెగ్ మెంట్ లలో ఫ్రెషర్స్ డిమాండ్ పెరిగింది.

ఇదే విధంగా బిపివొ, రిటైల్,  ఫ్రంట్ ఆఫీస్, రిటైల్ స్టోర్ మేనేజర్స్, ఫీల్డ్  సేల్స్,  అకౌంటెంట్  ఉద్యోగాలు బాగా పెరిగాయి.   Freshersworld.com జాబ్స్ పోస్టు చేయడం లో 433 శాతం పెరుగుదల ఉందని  ఆయన చెప్పారు.

గత ఏడాది ఏప్రిల్ లో 9000 పోస్టింగులుంటే ఇపుడివి 39,000 లకు పెరిగాయని ఆయన చెప్పారు. ఫ్రెషర్స్ డిమాండ్ 2021 జూన్ నాటికి కోవిడ్ ముందున్న పరిస్థితికి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, ఇక్కడొక ఆసక్తి కరమయిన మార్పు కనిపిస్తూఉంది.

కోవిడ్ రాకముందు ఫ్రెషర్స్ నువెదికి పట్టుకునేందుకు కంపెనీలు క్యాంపస్ లకు వెళ్లేవి. అపుడు క్యాంపస్  రిక్రూట్ మెంట్ బాగా పాపులర్. కోవిడ్ వచ్చాక ఈ పరిస్థితి మారింది.

క్యాంపప్ హైరింగ్ వర్చువల్ పద్ధతిలోకి వచ్చింది. ఇదొక కొత్త పరిణామం. మధ్యరకం  కంపెనీలన్నింటిలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ అనేది 10 నుంచి 15శాతం దాకా ఉండేది. ఇపుడు వర్చువల్ పద్ధతి మొదలయ్యాక మూడింతలు పెరిగింది. ఇదే విధానం కొనసాగనుందని  కంపెనీల నిపుణులు చెబుతున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *