టీడీపీ హయాంలో విజయవాడలో పెద్ద ఎత్తున దేవాలయాలను కూలగొట్టారని వాటి పునఃనిర్మాణ మహా క్రతువును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ‘గత సర్కారు నగరంలో కూల్చివేసిన 9 గుడులకు సంబంధించి రూ.3.79 కోట్లతో తొలిదశలో పునఃనిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భూమి పూజ నిర్వహించనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి, విస్తరణలో భాగంగా రూ.77 కోట్లతో చేపట్టిన మరో 8 పనులకు కూడా సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు,’ అని ఆయన చెప్పారు.
దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ రూ.77 కోట్లతో చేపడతామని అందులో రూ.70 కోట్ల నిధులు ప్రభుత్వం సమకూరుస్తోంది. మిగతా రూ.7 కోట్లను దుర్గ గుడి నిధుల నుంచి వెచ్చించనున్నారని ఆయన తెలిపారు..
విజయవాడలో పునఃనిర్మాణం చేపట్టే ఆలయాలు ఇవీ..
1. రూ.70 లక్షలతో రాహు–కేతు ఆలయం
2. రూ.9.50 లక్షలతో శ్రీసీతమ్మ పాదాలు
3. రూ.31.50 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో)
4. రూ. 2 కోట్లతో రాతితో శ్రీశనీశ్వర ఆలయం పునఃనిర్మాణం
5. రూ. 8 లక్షలతో బొడ్డు బొమ్మ..
6. రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద)
7. రూ. 10 లక్షలతో శ్రీసీతారామ లక్ష్మణ సమేత శ్రీదాసాంజనేయ ఆలయం
8 రూ. 10 లక్షలతో వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్ రూం సమీపంలో)
9. కనకదుర్గ నగర్లో రూ.20 లక్షలతో శ్రీవేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల.
దుర్గ గుడి అభివృద్ది విస్తరణ పనులు ఇలా…
1. రూ.8.50 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం
2. రూ. 5.60 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునః నిర్మాణం
3. రూ. 2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ
4.రూ. 23.60 కోట్లతో కేశఖండన శాల భవన నిర్మాణం
5.రూ. 19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం
6. రూ. 5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా (తిరుపతి అలిపిరి వద్ద ఉండే ద్వారం మాదిరిగా దుర్గ గుడి ఘాట్ ఆరంభం వద్ద నిర్మిస్తారు)
7. రూ. 6.5 కోట్లతో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడకుండా మరమ్మత్తులు, పట్టిష్ట చర్యలు.
8. రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనులు