‘అమరావతి బానిసల ఉచ్చులో రాయలసీమ ఉద్యమకారులు పడొద్దు!’

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)

నాడు చంద్రబాబు గారి ప్రభుత్వం రాజాధాని , జీఓ 120 , శ్రీసిటీని నెల్లూరు జిల్లాలో కలపడం , కండలేరు పధకాన్ని రద్దు చేయడానికి వ్యతిరేకంగా ఎలా మనం మాట్లాడామో నేడు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీమకు హైకోర్టు అంటే స్వాగతించాము  గండికోట రిజర్వాయర్ కి నీరు నింపే ప్రయత్నాలను స్వాగతించాము, కుందూపై రిజర్వాయర్ నిర్మాణం చేపడితే సంతోషించాము.

అదే సందర్భంలో రాయలసీమలో ప్రాథమిక ఏర్పాట్లు చేయకుండా తెలంగాణ ప్రభుత్వంతో కలిపి గోదావరి నీరు రాయలసీమకు అంటే వ్యతిరేకించాము.  పోలవరం సరే, దుమ్ముగూడెం లేకుండా రాయలసీమకు నీరు ఎలా వస్తుంది అని మాట్లాడుతుంది మనమే , KRMB (Krishna River Management Board)  రాయలసీమకు రావాలని చర్చ పెట్టింది మనమే.

మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి

గత కొన్ని రోజులుగా అమరావతి అనుకూల వ్యక్తులు బోర్డు విశాఖలో పెడుతున్నందుకు ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదించడం లేదు.

ఎలాగైనా దాన్ని కూడా అమరావతిలో పెట్టాలి అన్నది వారి ఉద్దేశం.

గతంలో ఈ బోర్డు  కార్యాలయం విజయవాడలో అని చర్చ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?

వీరికి నిజంగా రాయలసీమ మీద ప్రేమ ఉంటే చంద్రబాబు , లోకేష్ గార్ల నుంచి ఒక ప్రకటన ఇప్పించి తర్వాత మాట్లాడాలి.

వారి బాధ  KRMB రాయలసీమకు రాలేదు అని కాదు అమరావతిలో పెట్టలేదు అని మాత్రమే.

నన్ను ట్యాగ్ చేసే వారికి ఒకటే చెప్పదలుచుకున్నా మీ నాయకుడితో KRMB పై ఒక ప్రకటన ఇప్పించి తర్వాత నాతో మాట్లాడండి.

నాతోటి సీమ ఉద్యమ కార్యకర్తలకు నా చూచన మనం ఏమి చేయాలో మనకు తెలుసు మన మార్గాన్ని మనం ఎంచుకుందాము. అమరావతి బానిసల సలహాలు మనకు వద్దు.

 

(రచయిత మాకిరెడ్డి రాయలసీమ విద్యావంతులు వేదిక కన్వీనర్, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *