బంగారుధరలకు కొత్త సంవత్సరం శుభారంభం పలికింది. సోమవారం నాడు ధర గత రెండువారలతో పోలిస్తే 2 శాతం పెరిగింది. దీనికి కారణం అమెరికా డాలర్ బలహీనపడి 2018నాటికి పడిపోవడం.
డాలర్ బలహీన పడితే,ఇతర కరెన్సీలవిలువ పెరుగుతుంది. అపుడు ప్రజలు బంగారుకొనేస్తుంటారు. ఇపుడు అంతర్జాతీయంగా కోవిడ్ పరిస్థితులు మళ్లీ చెడిపోతున్నది. ఇంగ్లండు, జపానలలో ఆంక్షలు మొదలవుతున్నాయి. అందువల్ల బంగారులో ఇన్వెస్ట్ చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. దీనితో భారత్ లో పది గ్రాముల బంగారు ధర రు. 877 పెరిగి రు. 50,619 కి చేరింది. ఇంతకు ముందు పది గ్రాముల ధర రు. 49,742 మాత్రమే ఉండింది.
అంతర్జాతీయ మార్కెటె లో కూడా బంగారు ధర పెరిగింది. ఇది ఔన్స్ ధర 1935 అమెరికన్ డాలర్లు దాటింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 2.2 శాతం పెరిగి 1,934.81 డాలర్లకు చేరింది.
బంగారు ధర 1900 డాలర్ల లోపే ఉండింది. అలాంటిది కొత్త సంవత్సరంలో 1935 డాలర్లకు పెరగడం ఒక మంచిపరిణామం. డాలర్ బలహీన పడటం అనేది బంగారు ధరలు పెరిగేందుకు దోహదపడుతుంది.