ఒక ఎమ్మెల్సీగా, పులివెందుల ఇన్ఛార్జిగా ఉండే నన్ను కడప జిల్లా పోలీసులు అంతర్జాతీయ నేరస్థుడిలా వెంటపడి పట్టుకున్నారని స్టేషన్ కు రమ్మంటే వస్తాం కదా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ,ఎమ్మెల్సీ బికెట్ రవి నిరసన వ్యక్తం చేశారు. ఒక అత్యాచార సంఘటన స్పందిస్తే తన మీద కేసు పెట్టారని, అది కూడా తాను స్పందించిన రెండు వారాల తర్వాత కేసు పెట్టి అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు..
తాను దేశం విడిచి పారిపోతున్నట్లుగా వెంటపడి పట్టుకోవడం భావ్యం కాదని చెబుతూ అరెస్టు చేశాక నీరు తాగుతాం, అన్నం తింటామంటే కూడా అనుమతి ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
‘వీరు నమోదు చేసిన కేసు ఎస్ సి కేసు కిందికి రాదు. నా మీద, వంగలపూడిఅనిత మీద కేసు పెట్టడం జరిగింది. వంగలపూడి అనిత ఎస్సీ అయితే ఆమెపైన ఎస్సీ కేసు నమోదు చేయడం వింతగా ఉంది,’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రకటనలోని అంశాలు:
ఇలాంటి వింతలు జగన్ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. అత్యాచార సంఘటనకు నిరసనగా మేం స్పందించి రెండు వారాలైతే అప్పటి నుంచి ఈ కేసు గోప్యంగా ఉంచారు.
రెండు రోజుల క్రితం వరకు కూడా మేం ఇంటి దగ్గరే ఉన్నాం. అక్కడ అరెస్టు చేసి ఉండివుండవచ్చు. దేశం విడిచి పారిపోతున్నవారిలాగ అరెస్టు చేయడం జరిగింది. ఇదేమీ కొత్త కాదు. మేం ఇలాంటి కేసులకు భయపడేదిలేదు. పార్టీ కోసం మేం జైలుకు పోవడానికి సిద్ధమే.
20 నిమిషాలు అన్నారు. చాలా సేపటివరకు కూర్చోబెట్టారు.. మధ్యాహ్నం భోజనం కూడా లేకుండా ఇబ్బంది పెట్టారు. జూమ్ ఆప్ లో మాట్లాడడానికి అనుమతి ఇవ్వలేదు. ఇంటివారితో మట్లాడుతానని చెప్పి మాట్లాడాను. మేమేమీ వైసీపీవారిలాగ మానభంగాలు, హత్యలు, అవినీతి, అరాచకాలకు పాల్పడలేదు. జైల్లోనైనా మేం ప్రశాంతంగా ఉండగలం. ఎన్నికల వరకు మమ్మల్ని కష్టడీలో పెట్టుకున్నా భయంలేదు. ఇలాంటి ప్రభుత్వాలను అనేకం చూశాం. ఏం చేసినా చట్టపరంగా చేసుకోవాలిగాని ఈ విధంగా ఇబ్బంది పెట్టొద్దని ముఖ్యమంత్రిగారికి, పోలీసులకు హెచ్చరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేంతవరకు పోరాడుతానే ఉంటాం. అప్పటి వరకు పోలీసు కష్టడీలో ఉండడానికైనా సిద్ధపడి ఉన్నాం. నా విషయంలో ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.