ఈ రోజు టిడిపి వైసిపిల మధ్య రామతీర్థం రేసు రంజుగా సాగింది. చంద్రబాబు నాయుడికంటే ముందుగానే రామతీర్థం చేరుకునేందుకు పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిలించింది.చంద్రబాబు నాయుడికి దారిలో రోడ్డు మీద లారీలు అడ్డం పెట్టి ఆయన సకాలంలో రామతీర్థం చేరుకోకుండా చేయడంలో ప్రభుత్వం విజవయవంతం అయింది.
చంద్రబాబునాయుడి పర్యటనను అడ్డుకోవడానికే డీజీపీ విజయసాయితో రామతీర్థం పర్యటన డిజైన్ చేయించారని
ప్రభుత్వ అనుమతి తీసుకొని రామతీర్థం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవడమేటని టిడిపి ప్రశ్నిస్తూ ఉంది.
ఈ అడ్డంకులు జాతీయ వార్తగా మారి జగన్ ప్రభుత్వానికి బాగా దుష్ప్రచారం లభిచిందనక తప్పదు. అయితే, చివరకు ఆలస్యంగానయినా చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకున్నారు.
రామతీర్థం ఈ రోజు రాజకీీయ జెండాలతో రెపరెపలాడింది.అధ్యాత్మిక వాతావరణం ఉండాల్సిన చోట రాజకీయ వేడి పెరిగింది. రామతీర్థం నుంచి విజయసాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడి మీద తీవ్రంగా దాడి చేశారు. అసలు రాష్ట్రంలోని ఆలయాల మీద జరగుతున్న దాడులు తెలుగుదేశం పథకాలే ననేది విజయసాయి రెడ్డి విమర్శల సారాంశం. ఆయన దాడి ముఖ్యాంశాలు:
1- అర్థరాత్రి చీకట్లో ఎవరూ చూడనప్పుడు, ఎటువంటి ఆధారాలు లేకుండా, రథాలు తగులబెట్టడం, విగ్రహాలు విరగ్గొట్టడం వంటి కుట్రపూరితమైన, నేరపూరితమైన పనులు చేయడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నదే చంద్రబాబు వ్యూహం. రామతీర్థం కొండపై జరిగినటువంటి దుర్ఘటన చాలా దురదృష్టకరం.
2- మంచి పరిపాలన అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా, ఒక కుట్రపూరితంగా, చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. విగ్రహాల విధ్వంసం చేయించి, పుకార్లు లేవదీయాల్సిన అవసరం చంద్రబాబుకు తప్ప వేరెవరికీ లేదు.
3- పప్పు నాయుడు లోకేష్ ఛాలెంజ్ విసిరాడు. మీరు అడిగినట్టుగా సింహాచలం అప్పన్న స్వామి సన్నిధికి నేను వస్తా. మీరు డేట్, టైమ్ చెప్పండి. మీ పాత్ర ఉందా.. లేదా అన్నదానిపై చర్చించడానికి నేను సిద్ధం.
– స్వయంగా నీవే రా. నీవే తేదీ నిర్ణయించు, సమయం నిర్ణయించు. నేను డిబేట్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.
4- ఈరోజుకీ కూడా దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా టీడీపీ నేత అశోక్ గజపతి రాజే. ఆయన ఛైర్మెన్ గా ఉండగా, 30వ తేదీన విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో పెద్దఎత్తున ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ గారు ప్రారంభిస్తే.. దానిని డైవర్ట్ చేసేందుకు ఒకరోజు ముందు అంటే 29న ఇటువంటి నీచమైన పనికి చంద్రబాబు, ఆయన అనుచరులే పాల్పడి ఉంటారు.
– అశోక్ గజపతిరాజు ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి, నీతి, నిజాయితీ, విలువలు కలిగిన వ్యక్తి అయితే తక్షణం ఆయన రాజీనామా చేయాలి.
5. చంద్రబాబుకు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. చంద్రబాబు మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గడచిన 5 ఏళ్ళ పాలనలో 20 వేల ఆలయాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. దేవాలయాల్లో కనీసం నైవేద్యం పెట్టే దిక్కు కూడా లేకుండాపోయింది.
* తాను అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 39 పురాతన ఆలయాలను ప్రభుత్వమే కూల్చివేసింది.
* తిరుమలలో పోటు గదులను మూసివేసి.. వాటిలో తవ్వకాలు జరిపారు. దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి, సింహాచలం, పెందుర్తి ఆలయల దగ్గర భైరవ దేవాలయంలో క్షుద్ర పూజలు జరిగాయి.
* ఆలయాలపై చంద్రబాబు హయాంలో నియమించిన పాలక మండళ్ళ పెత్తనం అధికమై, వేధింపులు తట్టుకోలేక అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
* అర్చకులకు వంశపారపర్యమైన హక్కులు కల్పించమంటే.. గొంతెమ్మ కోర్కెలు కోరవద్దని అర్చకులను అవమానించాడు. ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలు బంద్ అయ్యాయి. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి దుష్ట చట్టాలను చంద్రబాబు అమలు చేశారు.
* అమరావతి సదావర్తి భూములతో సహా.. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములను మింగేశారు.
* తప్పులు చేసే వారే గుడులకు వెళతారు.. అయ్యప్ప దీక్షల సమయంలో 40 రోజులు మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయి.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడే.
వైయస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఈరోజు ఉదయం రామతీర్థం ఆలయాన్ని సందర్సించడం జరిగింది. ఘటన జరిగిన కొండ పక్కన ఉన్న కొలను ప్రాంతాన్ని పరిశీలించి. ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసు కోవడం జరిగింది. pic.twitter.com/KMuXptIPMA
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 2, 2021