అమరావతి ప్రజలు కోరితే తాను అమరావతి కోసం ఆమరణ దీక్ష చేస్తానని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సన్షేషనల్ కామెంట్స్ చేశారు. ఊరికే మాట్లాడే సమయం కాదని ఉద్యమం చేయాల్సిన సమయం అని ఆయన అనంతపురంలో అన్నారు.
తన తమ్ముడితో కలసి తాను తాడిపత్రిలో జనవరి 4 వ తేదీన ఆమరణ దీక్ష చే స్తామని అన్నారు. 144 సెక్షన్ ఉన్నా, కోవిడ్ యాక్ట ఆంక్షలున్నా దీక్ష ఉంటుందని, అరెస్టు చేస్తారేమో చేసుకోవచ్చని జెసి అన్నారు.తమ కుటుంబ సభ్యుల మీద పాత కేసులు తిరగదోడి వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ మధ్య ఆయన మీద, కొందరు అనుచరుల మీద ఎస్సి ఎస్టీ కేసును పెట్టిన విషయం ప్రస్తావిస్తూ కులంపేరుతోదూషించాలని తన మీద ఆరోపణచేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా జనవరి నాలుగు నుంచి దీక్ష ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
నాయకులంతా తమ స్పీచ్ లతో అమరావతి ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఏడాదైనా ఏమైనా స్పందన ఉందా? ఇంకేందుకు ఉద్యమం ? ఢిల్లీ ఉద్యమం చూడండి. నెలరోజులకే నాలుగుసార్లు కేంద్ర ప్రభుత్వ దిగివచ్చి చర్చకు పిలించింది. అందువల్ల అమరావతి మీద ఇపుడు సాగుతున్న ఆందోళన ఇలాంటి వాటితో ప్రభుత్వం స్పందించదు.. ప్రాణ త్యాగానికి సిద్ధం కావాలి. అక్కడి ప్రజలు కోరితే నేను అమరావతి కోసం ఆమరణ దీక్ష చేసేందుకు రెడీ. అమరావతే రాజధానిగా ఉండాలి.