చిత్తూరు జిల్లాలో నగరి సమీపంలో ఉన్న ఎత్తయిన శిఖరం నగరి నోస్. దూరాన్నుంచి పక్షి ముక్కులాగా కనబడుతుంది కాబట్టి దీనిని నగరి నోస్ అన్నారు. అద్భుతమయిన ఈ శిఖరం నిజానికి ఒక పర్వతారోహణ ఔత్సాహికులకు కేంద్రం కావాలి. అలాగే ట్రెకర్స్ ఇక్కడి క్యూకట్టాలి. విద్యార్థుల,యువకులు పెద్ద ఎత్తున రావాలి. కాని అలా జరగడం లేదు.మనం పర్యాటక రంగాన్ని బాగా విస్మరించామనడానికి ఇదొక నిదర్శం.తిరుపతి ట్రెకర్స్ సభ్యలం ఈ నిన్న ఈ శిఖరానికి ట్రెక్ చేశాం. ఇది మాటల్లో చెప్పలేనంత ఆనందం. అక్కడి పర్వత సౌందర్యం చెప్ప నలివికానిదని భూమన్ (75 సంవత్సరాలు) చెబుతున్నారు. భూమన్ తిరుపతి కాలేజీ ప్రొఫెసర్ గా రిటైరయ్యారు.రచయిత. ఒకపుడు తెలుగురాష్ట్రాలో పేరొందిన వక్త. చాలామంది సుదూర ప్రాంతాల వాళ్లు కూడా వచ్చి వాళ్ల బృందంలోచేరి శేషాచలం కొండల్లో ట్రెకింగ్ లో పాల్గొంటున్నారు. ఔత్సాహికులు ఆయన కు ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబర్ 90107 44999)
(ఈ పోస్టు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి)