ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో జననేత అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసిపి ఎమ్మెల్యేల మీద తీవ్రమయిన వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్రజాప్రతినిధులకు పేకాట క్లబ్బులు నిర్వహించడంలో బాగా శ్రద్ధ ఉంది. అయితే, రోడ్ల వంటి వసతులను కల్పించడం ఆ శ్రద్ధ చూపడం లేదని అన్నారు.
కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గుడివాడ చేరుకున్నారు.
అభిమానులు ఎప్పటిలాగే పవన్ ను చూసేందుకు విరుచుకుపడ్డారు. ఒక అభిమాని క్రేన్ తో భారీ గజమాల వేసి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికాడు.
అభిమానులకు, జనసేన పార్టీ శ్రేణులకు అభివాదం చేసుకుంటూ వాహనం మీద నిలబడి గుడివాడలో రోడ్ షో నిర్వహించారు.
నెహ్రూ చౌక్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసిపి ప్రజాప్రతినిధుల మీద తీవ్రంగా విమర్శులు చేశారు.
పవన్ ప్రసంగ విశేషాలు
పవన్ ప్రసంగ విశేషాలు:
*మొదటిసారిగా గుడివాడ వచ్చాను, ఎంతో చక్కని ఆదరణ, స్వాగతాన్ని ఇచ్చినందుకు గుడివాడ ప్రజల ప్రేమను ఎప్పటికి గుర్తుంచుకుంటాను
* అన్నివర్గాల, కులాలు, మతాల ప్రజలకు న్యాయం జరగాలని JanaSenaParty పెట్టాను, ఏ ఒక్క వర్గానికో, కులానికో, మతానికో అండగా నిలబడేందుకు కాదు
* చాలామంది మనం ఓడిపోగానే భయపడి వెనుకడుగు వేస్తాం అనుకుంటారు, కానీ ఆశయం ఉన్న వాడికి ఓటమి ఉండదు, ముందడుగే తప్ప వెనుకడుగు వెయ్యం
*ప్రజా ప్రతినిధులు ఏ స్థాయి వ్యక్తులైనా సరే, బాధ్యతగా వ్యవహరించకపోతే వారిని రోడ్డు మీదకు తీసుకోస్తాం జాగ్రత్త
* ప్రజలను భయపెట్టి పాలిద్దాం అనుకుంటే అలాంటి ప్రజాప్రతినిధులను సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరు
* కంకిపాడు నుండి గుడివాడ వస్తుంటే రోడ్లన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ప్రజలు ఎందుకు వారిని నిలదీయడం లేదు
* వైసీపీ ప్రజాప్రతినిధులు వారి పేకాట క్లబ్బులు నిర్వహించినట్లుగా ప్రభుత్వ వ్యవస్థను నిర్వహించడం లేదని సమాచారం
* నోటి దురుసుగా మాట్లాడే ఏ ప్రజాప్రతినిధి అయినా, బాధ్యతా రహిత్యంగా వ్యవహరించే ఏ ప్రజాప్రతినిధిని అయినా సరే JanaSenaParty చాలా బలంగా ఎదుర్కొంటుంది.