సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ . నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మరో ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేషన్‌తో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదలైంది. సినిమా విడుదల అనంతరం జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ….
నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “మా ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమాను ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు .ఇంతకు ముందు మా ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందు సగం సినిమా పైరసీకి గురైతే, అప్పుడు తెలుగు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి ఆశీర్వాదాలు అందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా అప్పుడు బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు కోవిడ్ సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను ఇండస్ట్రీ బాగా సపోర్ట్ చేసింది. అలాగే ప్రేక్షకులు కూడా సినిమాను చూసి సక్సెస్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్ సోకుండా ఉండేందుకు పాటించాల్సిన సూత్రాలను పాటిస్తూ మా ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమాను ఎంజాయ్ చేయండి. జీ స్టూడియోస్ వారు ఎంతగానో సపోర్ట్ చేశారు. యువీ వంశీ, దిల్‌రాజుగారు, శిరీశ్‌గారు సహకారంతో థియేటర్స్‌లో ఇబ్బంది లేకుండా విడుదల చేయగలిగాం” అన్నారు.
చిత్ర దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ ” ఈ కోవిడ్ సమయంలో మా ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేం ఏదైనా నమ్మి సినిమా చేశామో అది ఈరోజు నిజమైంది. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోష్స్ అన్నింటికీ మంచి ఆదరణ దక్కుతుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమా విడుదల కావడానికి సపోర్ట్ చేసిన ఇండస్ట్రీ అంతటికీ ధన్యవాదాలు. సాయితేజ్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం మార్నింగ్ షోస్‌కు దాదాపు కోటి రూపాయల గ్రాస్ రావడం చాలా ఆనందంగా ఉంది. థియేటర్స్‌లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి కుటుంబంతో సహా వచ్చి ఎంజాయ్ చేయండి” అన్నారు.
సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ “తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సహా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా నిర్మాతలు సినిమాను ఈ సమయంలో విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగాం. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ .. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవడమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాను విడుదల చేయడానికి అందరూ చాలా కష్టపడ్డారు. సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి ఇండస్ట్రీ, మీడియా, ప్రేక్షకులే కారణం. సినిమాను ప్రేక్షకుల మధ్యలో చూశాం. సినిమా చూస్తుంటే మాపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్నాను. తెలుగు ప్రేక్షకులకు థాంక్స్” అన్నారు.