విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద బోల్తా పడింది. 35 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి వారిన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. ఇది సిరి ట్రావెల్స్ కుచెందిన బస్సు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తు వల్లే బస్సు బోల్తా పడినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.అయితే, సమీపంలోలోని టోల్ గేట్ వద్ద డ్రైవర్ క్లీనర్ టీ కూడా తాగారని, అక్కడి నుంచి 20 కిమీ దూరం వచ్చాక ఈ యాక్సిండెట్ జరిగిందని ప్రయాణికుడొకరు తెలిపారు.
తెలుగుదేశం పార్టీమాజీ శాసన సభ్యులు శ్రీ రాం తాతయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని పరామర్శించారు.