ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు దాటింది. ఈ ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎలా చతికిల పడిందో ప్రొఫెసర్ హరగోపాల్ వివరిస్తూ చాలా చక్కవగా వివరించారు. ఆయన రాసిన సుదీర్ఘ వ్యాసంలో నుంచి 11 వాక్యాలు తెలంగాణ ఎలా ఉందో క్లోజ్ ప్ లో నుంచి చూపిస్తాయి.
ఎపుడొస్తాయో తెలియని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష్ కోసం ఆరేళ్లుగా లక్షలాది మంది యువకులు, ఆన్ లైన్ క్లాసులకు అతుక్కుపోయి, లైబ్రరీలు, యూనివర్శిటీలో కూలబడి, ఆశ ఆత్రంగా పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. వీళ్లిపుడు ఉద్యోగాలు తప్ప మరొక అంశం గురించి మాట్లాడే స్థితిలో లేరని ఆయన చక్కగా వివరించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆశయం నిజమవుతున్నదా? చెదరిపోతున్నదా?
ఆయన లెవనెత్తిన విషయాలు చూస్తే అర్థమవుతుంది. తెలంగాణలో యువకులు ఎలా ఉన్నారు? కళాకారులు ఏమయ్యారు, యూనివర్శిటీలు ఎలా తయారయ్యాయి? మేధావులు ఎలా తయారయ్యారు… ఇలా ఒక్కొక్క రంగాన్ని ఆయన చాలా స్పష్టంగా చూపించారు.
తెలంగాణలో పోరాట చేవని కావాలనే చంపేస్తున్నారని ఆయన చెప్పకనే చెప్పారు. ఆయన లెవనెత్తిన విషయాలు చాలా సీరియస్ ఆలోచించాల్సిన విషయాలు.
తెలంగాణ యువతర, కళ, సాంస్కృతిక రంగాలను పతనం చేసే ఏదో రోగం తాకిందన్న ఆవేదన ఆయన వ్యక్తం చేశారు.
“ఆర్థికవ్యవస్థ దెబ్బ తింటే కోలుకోవచ్చు, రాజకీయాలను సరిదిద్దవచ్చు కాని సాంస్కృతికంగా ప్రత్యేక గుర్తింపును కోల్పోతే జాతికి భవిష్యత్తు ఉండదు,” అని ప్రొఫెసర్ జయశంకర్ అన్నాడని ప్రొఫెసర్ హరగోపాల్ గుర్తు చేశారు. అంటే తెలంగాణ జాతి ఏంకోల్పోతున్నదో ఆయన ప్రొఫెసర్ జయశంకర్ చేత చెప్పించారు.
ప్రొఫెసర్ హరగోపాల్ నిఖార్సయిన తెలంగాణ మేధావి. ప్రజలపక్షల పాతి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రాజకీయశాస్త్రం ఆచార్యుడుగా పనిచేశారు. తెలంగాణలోఎక్కడు ఎపుడు పౌరహక్కులు, మానవ హక్కులు హరించుకుపోయినపుడల్లా ఆయన ఎలెగుత్తుతుంటారు. ఇవి ఈ రోజున ఆయన ఒక దినపత్రికలో రాసిన వ్యాసం నుంచి సేకరించిన 11 అబ్బురపరిచే అంశాలు:
పునర్నిర్మాణం అనే స్వప్నం లేకపోవడంతో దెబ్బలు తిని, త్యాగాలు చేసిన వాళ్లు ఏమీ కాకుండాపోయారు.
తెలంగాణ యువత చాలా ఆశయ సాధకులు. ఎంత కాదన్నా పోరాట స్ఫూర్తి ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కేవలం భద్రత కలిగిన ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కుంచించుకుపోయారు.
తెలంగాణ లో చాలా ఉద్యోగాలు వస్తాయనే ఆశ కల్పించడంతో, లక్షల మంది యువత సర్వీస్ కమిషన్ ప్రకటన వస్తుందని పరీక్షల కోసం సన్నద్ధం కావడంలో మునిగిపోయారు. ఈ పరీక్షకు టివిలో లెక్చర్ ఇస్తే వాటి ముందు కూర్చుని వేలాది మంది నోట్స్ రాసుకుంటున్నారు.
హైద్రాబాద్లోని ప్రతి లైబ్రరీలో వందల మంది యువత పరీక్షల కోసం చదువులో పడిపోవడంతో వాళ్లు దాదాపు తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా మరచిపోయారు. పోనీ ఆ ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా అంటే గత ఆరు సంవత్సరాలలో 30వేల ఖాళీలు భర్తీ చేశామంటున్నారు. అంటే, సంవత్సరానికి ఐదు వేల చొప్పున సర్వీస్ కమిషన్ నియామకాలు చేసింది.
తీవ్ర నిరాశకు గురైన తెలంగాణ యువత ఏమీ తోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర తెలంగాణ ఆస్తిత్వం గురించి మాట్లాడడమే కష్టమైపోయింది. ఇతర ఏ రాజకీయాలకైనా మద్దతు ఇచ్చే యువతగా మారిపోయారు.
తెలంగాణ ఉద్యమానికి నీరు పోసి పెంచిన ఇందిరాపార్క్ వేదికను రద్దు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తాళాలు వేశారు. ఉమ్మడి రాష్ట్ర నిర్బంధ సంస్కృతి మరింత ఉధృతంగా తెలంగాణకు వచ్చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత అందుబాటులో కూడా ముఖ్యమంత్రి, మంత్రులు అందుబాటులో లేకుండా పోయారు. ఇక ఇది మన తెలంగాణ, వీళ్ళంతా మా వాళ్ళు అని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎలా భావిస్తారు.
ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించిన కోదండరాంను కదలనివ్వకుండా మెదలనివ్వకుండా చేశారు.
తెలంగాణ ఉద్యమానికి నిజాయితీగా, ఏం ఆశించకుండా మద్దతు ఇచ్చిన దాదాపు 70 మందిపై ఉపా కేసులు పెట్టారు. ఇట్లా గతంలో ఎప్పుడూ జరగలేదు.
తెలంగాణ అస్తిత్వాన్ని అద్భుతంగా పలికించిన అందెశ్రీ జయ, జయహే తెలంగాణ పాట ఏమయ్యింది? అందెశ్రీ గేయం ప్రతి స్కూల్లో, ప్రతి సదస్సులో పాడించవలసింది.
గోరటి వెంకన్న, గద్దర్, జయరాజ్, నందిని సిద్దారెడ్డి లాంటి కవుల పాటలు ఏవీ? కంచుకంఠంతో మాట్లాడే దేశపతి శ్రీనివాస్ ఏమయ్యాడు? ఆర్థికవ్యవస్థ దెబ్బ తింటే కోలుకోవచ్చు, రాజకీయాలను సరిదిద్దవచ్చు కాని సాంస్కృతికంగా ప్రత్యేక గుర్తింపును కోల్పోతే జాతికి భవిష్యత్తు ఉండదనేవాడు ప్రొఫెసర్ జయశంకర్.