హైదాబాద్ రోడ్డెక్కితే, ఏదో ఒక చోట మీ కదలికలు రికార్డవుతాయి. మిమ్మల్ని నలువైపుల నుంచి కెమెరా రహస్యకళ్లు చుట్టుముడతాయి. గమనిస్తూ ఉంటాయి.ఏ పిచ్చివేషమేసినా అది ఏదో ఒక కెమెరాకు చిక్కుతుంది. ఈ విషయంలో హైదరాబాద్ నగరం ఇండియాల్ నెంబర్ వన్. అంతేకాదు, న్యూయార్క్, బెర్లిన్ వంటి నగరాలను తలదన్నింది. ఇలా అంత్యంత్య తీక్షణంగా మనుషులు మీద నిఘా వేసిన 20 మహానగరాలలో హైదరాబాద్ ఒకటయింది.
తెలంగాణలో ఈ హోదా ఇపుడు సిద్ది పేట జిల్లాకు దక్కిది. హైదరాబాద్ బయట తెలంగాణలో అత్యధికంగా సిసిటివి (CCTV)కెమెరాలను ఏర్పాటుచేసిన జిల్లా సిద్ధిపేటయే. సిద్దిపేటలో నేరాలను తగ్గించేందుకు, అవాంఛనీయం సంఘటలను జరుకుండా ఎపుడు నిఘా వేసేందుకు సిసిటివి ల ఎర్పాటుజరుగుతూ ఉంది.ప్రజాప్రతినిధుల సహకారం, స్థానిక వితరణ శీలుర సాయంతో ఇంతవరకు 4806 సిసిటివి కెమెరాలను అమర్చారు.ఇదొక రికార్డు. ఆర్థిక మంత్రి హారీష్ రావ్ సొంత నియోజకవర్గమయిన సిద్దిపేట ఇప్పటికే ఎన్నోరికార్డులు సృష్టించింది. కొత్త జిల్లా కేంద్రం అయినా ఏ పాతజిల్లాకేంద్రానికి తీసిపోనంత హుంగులు సమకూర్చుకుంది. సిసిటివి కెమెరాల నిఘ ఇపుడు మరొక రికార్డు.
దీనితో హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండలకు బయట అత్యధిక ఈ నిఘా కెమెరాలున్న జిల్లా గా సిద్ది పేట రికార్డు సృష్టించింది. ఇక్కడ పోలీసుకమిషరేట్ పరిధిలోని 499 గ్రామాలలో 475 గ్రామాల్లో సిసిటివి కెమెనాలను అమర్చారు. ‘‘నేనే సైతం’’కార్యక్రమం కింద ఈ కెమెరాలను ప్రజలు డొనేట్ చేసేలా అన్ని పోలీస్ స్టేషన్లు బాగా కృషి చేశాయి. తొందర్లోనే మిగతా 24 గ్రామాలలో కూడా కెమెరాలను అమర్చుతామని కమిషనర్ జోయెల్ డేవీస్ చెప్పారు.
జిల్లాలోని అన్ని వూర్లలో ఉండే ముఖ్యమయిన జంక్షన్లు, కీలకమయిన రోడ్లు, ప్రదేశాలు అన్నింటి మీద ఇపుడు కమిషనరేట్ లోఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ రూం నుంచి పోలీసులు 24 గంటలు ఒక కన్నేసి ఉంచేందుకు వీలయింది. కమాండ్ అండ్ కంట్రోల్ రూం నుంచి ఎఎస్ ఐ సంధాని నాయకత్వంలోని ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ టీమ్ (OMT) సిసిటివి కెమెరాలకు అమర్చిన టివి మానిటర్ల నుంచి గమనిస్తూ ఉంటుంది. ఏ మార్గంలోనైనా కెమెరా పనిచేయకపోతే, ఈ బృందం వెంటనే నిపుణుల ను పంపి మరమ్మతు చేయిస్తుంది.
ఇండియాలో నెంబర్ వన్ హైదరాబాద్
ఒక అధ్యయనం ప్రకారం, హైదరాబాద్ నగరంలో ప్రతివేయిమందికి 30 సిసి కెమెరాలున్నాయి. దీనితో అంత్యంత నిఘా ఉన్న నగరరం హోదా కు తెలంగాణ రాజధానికి దక్కింది. ఇండియాలో ఏ నగరంలో కూడా ఇన్ని సిసి కెమెరాల్లేవు. ఉదాహరణకు బెంగుళూరులో ప్రతి వేయి జనాభాకు ఒక కెమెరాకూడా లేదు. అక్కడ ప్రతవేయికి కమెరా నిష్పత్తి కేవలం 0.11 మాత్రమే. లక్నోలో 2.94 కెమెరాలున్నాయి. పుణేలో 1.71 కెమెరాలు, కోల్ కతాలో 0.93, ముంబైలో 0.48 జైపూర్ లో 0.26 కెమెరాలు మాత్రమే ఉన్నాయి.
కెమెరాల పర్యవేక్షణలో హైదరాబాద్ లండన్ వంటి మహానగరాలకు పక్కన చేరింది. టాప్ 20 దేశాలలో హైదరాబాద్ కు 16 స్థానం లభిస్తే, లండన్ మూడోస్థానంలో ఉంది . మిగతా 18స్థానాలలో అధికంగా చైనాలోని నగరాలే. అందుకే ప్రపంచంలోనే చైనా మోస్ట్ సర్వైల్డ్ కంట్రీ (most surveilled country in the world) అయింది.
ఉదాహరణకు ప్రపంచ అత్యధిక నిఘాఉన్న 50 నగరాలజాబితా తయారుచేస్తే 34నగరాలు చైనా నుంచే ఉంటాయని యుకె కి చెందిన టెక్నాలజీ రీసెర్చ్ గ్రూప్ ‘Comparitech’ పేర్కొంది.
చెన్నై 25.52 కెమెరాలతో 21 స్థానంలో నిలబడుతుంది. దేశరాజధాని లో ప్రతివేయిమందికి 14.18 కెమెరాలే ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఢిల్లీకి 33వ స్థానమే దక్కుతుంది
ప్రపంచంలో అత్యధికంగా సర్వైలెన్స్ కెమెరాలున్న నగరం చైనాలోని తాయ్ యువాన్ (Taiyuan). ఇక్కడప్రతివేయిమందిమీద 119.57 కెమెరాలు కన్నేసి ఉంచుతాయి. అయితే ప్రతి పదిమందికి ఒక సిసి కెమెరా ఉన్నట్లు లెక్క. చైనా రాజధాని కూడా ఈ విషయంలో వెనకబడే ఉంది. అక్కడి వేయిమందికి 56.20 కెమెరాలున్నాయి. కాని సంఖ్యరీత్యా తీసుకుంటే బీజింగ్ 11.50 లక్షల సిసి కెమెరాలను ఏర్పాటుచేశారు.
రష్యారాజధాని మాస్కోలో ప్రయివేయి మందికి 15.39 శాతం కెమెరాలుంటే బెర్లిన్ లో 4.9 , ప్యారిస్ లో 2.49, న్యూయార్క్ లో 3.8 కెమెరాలు మాత్రమే ఉన్నాయి.