ఇక నుంచి మీ ఫోన్ నుంచే ఆధార్ కార్డ్ అప్డే ట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ కు వెళ్లనవసరం లేదు
ఇపుడయితే, ఆధార్ సెంటర్ ను వెదుక్కుంటూ వెళ్లి, అక్కడ క్యూలో నిలబడి, ఎంతో కొంత ఫీజు చెల్లించి ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకోవాలి. ఇక ముంద ఆ అవసరం లేదు. ఆధార్ కార్డులలో తప్పులున్నా, అడ్రసు, పుట్టిన తేదీ, జెండర్, వంటి వివరాలను మార్చాల్సి ఉన్నా ఇంటి నుంచే సరిచేసుకోవచ్చు. మార్చుకోవచ్చు, కొత్త వివరాలు చేర్చుకోవచ్చు.
కేంద్రం ప్రభుత్వం ఈ మేరకు వెసలు బాటు కల్పించింది. దీనికోసం ప్రత్యేకంగా ఆధార్ సెల్ఫ్ సర్సీస్ వెబ్ సైట్ ప్రారంభించారు.
ఇపుడయితే, ఆధార్ కార్డులను అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆథరైజ్డు ఆధార్ సెంటర్ కు వెళ్లి తీరాల్సిందే.
అక్కడ రోజుకు 50కంటే ఎక్కవు ఎంట్రీలు చేయలేరు. దీనికోసం మీరు చాలా సేపు వేచి చూడాలి. లేదా మరొక అధార్ సెంటర్ ను వెదుక్కుంటూ వెళ్లాలి. పట్టణాలలో నివసించే వారు తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండటం, ఇళ్లు మారుతూ ఉండటంతో చాలా సార్లు ఆధార్ ను అప్ డే ట్ చేసుకోవలసి వస్తున్నది. ఇలాంటి వాళ్లకు పరిమిత సంఖ్యలో ఆదార్ సెంటర్ల్ ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అక్కడ గంటలకొద్ది క్యూలో నిలబడాల్సి వస్తున్నది. అన్ని రికార్డులతో అక్కడికి చేరుకోవాలి. ఆధార్ సెంటర్లో ఇవన్నీ చూపాలి. వాళ్లకు వచ్చే అనుమానాలు తీర్చాలి. ఆఫీసులకు వెళ్లేవారికి ఇలా తీరుబడిగా క్యూలో నిలబడుకోవడం సాధ్యం కాదు. బ్యాంకుల అవసరాల రీత్యా ఆధార్ ఎపుడూ అప్ డేట్ చేసుకుంటూ ఉండటం అవసరం.
డిజిటల్ ఇండియా అని చెప్పుకుంటూ ఇలా చిన్న కరెక్షన్ కోసమో, అప్ డేట్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చోనేలా చేయడం ఆశ్చర్యం.
అందువల్ల ఈ పురాతన పద్ధతికి స్వస్తిపలకాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇంటి నుంచే ఎవరైనా ఆధార్ ను అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం వీలుకల్పించింది.
ఆధార్ వెబ్ సైట్ https://ssup.uidai.gov.in/ssup/ తెరచి ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవచ్చు. కాకపోతే, మీ ఫోన్ ఇప్పటికే ఆధార్ తో లింక్ చేసి ఉండాలి.