వైకుంఠ ఏకాదశి పేరుతో పది రోజుల పాటు తిరుమల వైకుంఠ ద్వారం ( ఉత్తర ద్వారం) తెరచి భక్తులను అనుమతించాలనుకోవడం సంప్రదాయ వ్యతిరేకం అని తిరుమల భక్తుడు, తిరుపతి యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సంప్రదాయాలను దారిమళ్లించడం సరికాదని ఆయన చెబుతున్నారు. నవీన్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తి పూర్తిగా వీడియో చూడండి.:
1) తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాదాయశాఖ దేవాలయాలపై “ప్రభుత్వ పెత్తనం” ఉండకూడదు అన్న రీతిలో టీటీడీ అధికారుల అత్యుత్సాహంతో లైన్ క్లియర్ చేయబోతున్నారు!శుభపరిణామం!
2) వివిధ రాష్ట్రాలలో ఉన్న పీఠాధిపతులకు మఠాధిపతిలకు ఎన్నడూ లేని విధంగా లేఖలు రాసి వారి అనుమతితోనే తిరుమలలో సాంప్రదాయ పద్ధతిలో “రెండు” రోజులు తెరిచే వైకుంఠ ద్వారాలను “పది” రోజులు తెరిచేందుకు సన్నద్ధం అవుతున్నామని అధికారికంగా ప్రకటించారు!
3) తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శ్రీవారి నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు తరలించినప్పుడు కానీ శ్రీవారి సన్నిధిలో కైంకర్యాలు, ఆభరణాల విషయంలో భక్తులకు అనుమానాలు కలిగినప్పుడు సైతం నేడు లేఖలు ఇచ్చిన సుమారు 25 మందిలో ఏ ఒక్క గౌరవ మఠాధిపతి,పీఠాధిపతులు స్పందించకపోవడం గమనార్హం!
4) టీటీడీ అధికారుల,ధర్మకర్తల మండలి కోరిక మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులకు, అర్చకులకు,ఉద్యోగస్తులకు, స్థానికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు టీటీడీ తీసుకుంటారని ఆశిస్తూ ఆగమ శాస్త్ర, పాంచరాగ శాస్త్రంలో ఎక్కడ పది రోజులు వైకుంఠ ద్వారాలు తెరవకూడదు అని చెప్ప లేదంటూ చాలా జాగ్రత్తగా టిటిడి అధికారుల బాధ్యతలు గుర్తుచేస్తూ లేఖలు ఇచ్చారు!
5) ఆంధ్రప్రదేశ్ లోని హిందూ దేవాలయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు మఠాధిపతులు పీఠాధిపతులకు స్వాధీనం చేయండి అని భవిష్యత్తులో లేఖలు రాస్తే రాష్ట్ర ప్రభుత్వం,టీటీడీ ధర్మకర్తల మండలి, ఐఏఎస్ అధికారులు ఆమోదించాలి!
6) తిరుమల శ్రీవారి సన్నిధిలో “వైకుంఠ ఏకాదశి” ద్వాదశి” నాడు కేవలం సామాన్య భక్తులను,తిరుమల తిరుపతి స్థానికులను, టిటిడి ఉద్యోగస్తులను అనుమతించండి!
7) వైకుంఠ ఏకాదశి,ద్వాదశి తర్వాత మూడవరోజు నుంచి ప్రజా ప్రతినిధులను,ప్రోటోకాల్ పరిధి అధికారులను,ధర్మకర్తల మండలి సభ్యులు బంధువులను,టీటీడీ ఉన్నతాధికారులు వారి స్నేహితులను, సెలబ్రిటీలను,బడా పారిశ్రామికవేత్తలను మిగిలిన ఎనిమిది రోజులు అనుమతిస్తూ తిరుమల అధికారులు ప్రకటన చేయాలి!
8) వైకుంఠ ఏకాదశి,ద్వాదశి రెండు రోజులు”విఐపి బ్రేక్” “శ్రీ వాణి ట్రస్ట్” దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల స్పెషల్ ఆఫీసర్ ప్రకటించి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలి!