(ఎస్ వి ఎస్ సి ప్రసాద్)
సైన్స్ పట్ల, ముఖ్యంగా సృష్టి రహస్యాల పట్ల అల్బర్ట్ ఐన్ స్టీన్ కు అంత జిజ్ఞాస కలిగించేందెవరు? టైం అనేది ఏమిటి? స్పేస్ అనేది ఏమిటి, అసలు సృష్టి ఏమిటి, విశ్వం ఏమిటి అనే ప్రశ్నలకు సైన్స్ పరంగానే కాదు, తాత్వికంగా కూడా సమాధానం అన్వేషించేాలా ఐన్ స్టీన్ ఉసి కొల్పిందెవరు? (పై ఫోటో 1893లో ఐన్ స్టీన్ ది)
దీనికి సమాధానం తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
వాళ్లంటికి ప్రతి గురువారం భోజనానికి వచ్చే వారాలబ్బాయి ఐన్ స్టీన్ సైంటిపిక్ టెంపర్ నిప్పంటిచాడు. ఈ అబ్బాయి, జర్మనీ మ్యూనిక్ మెడికల్ స్కూలులో మెడిసిన్ చదువుతున్నాడు. ప్రతి గురువారం మధ్యాహ్నం వాళ్ల ఇంటికి ఈ మెడికో భోజనానికి వచ్చే వాడు. అది యూదు సంప్రదాయం. ఆ మెడికో పేరు మ్యాక్స్ టాల్మీ (Max Talmey1869-1941). అతను ఐన్ స్టీన్ లో రగిలించిన సైంటిపిక్ టెంపర్ చనిపోయేంతవరకు ఆరిపోలేదు.సరిగదా ప్రపంచమంతా అంటుకుంది.
ఇదెలా జరిగిందంటే…
1889లో టాల్మీ ఐన్ స్టీన్ ఇంటికి వారాలబ్బాయిగా కుదిరాడు. టాల్మీని వాళ్ల అన్న ఐన్ స్టీన్ కుటుంబానికి పరిచయం చేశాడు. భోజనానికి వచ్చినపుడల్లా టాల్మీ ఐన్ స్టీన్ కు సైన్స్ సంగతులెన్నో చెప్పేవాడు. తనదగ్గిర ఉన్నపుస్తకాలను అరువు ఇచ్చేవాడు. ఈ సంగతులన్నీ ఐన్ స్టీన్ చాలా ఆసక్తిగా వినేవాడు.వాటి గురించి తీవ్రంగా ఆలోచించేవాడు.
టాల్మీ ఐన్ స్టీన్ కంటే 11 సంవత్సరాలు పెద్దవాడు. ఐన్ స్టీన్ వయసు పదిన్నర సంవ్సరాలు.కాలేజ్ ప్రిపరేటరీ స్కూల్ Luitpold Gymnasium లో మూడో సంవత్సరం చదువుతున్నాడు అపుడు టాల్మీ వయసు 20 సంవత్సారాలు. అయినా, టాల్మీ చెప్పే విషయాలు ఐన్ స్టీన్ బుర్రలోకెక్కడం మొదలయింది.
“ Although there was a difference of 11 years between us, the boy had such an aptitude and zest for knowledge that it was an easy matter to get along together,” అని టాల్మీనాటిరోజులను, వారిద్దరి మధ్య కుదిరిన అనుబంధం గురించి ఒకసారి న్యూయార్క్ టైమ్స్ విలేకరులతో మాట్లాడుతూ నెమరేసుకున్నారు.
తన దగ్గిర అనేక సైన్స్ పుస్తకాలను ఆయన కుర్రఐన్ స్టీన్ కు అరువిచ్చే వాడు. వాటన్నింటిని ఐన్ స్టీన్ చూస్తుండగానే ఆపోసన పట్టేవాడు.
ఐన్ స్టీన్ జీవితంలో ఇవన్నీ నమ్మేలని నిజాలు. 1889 నుంచి 1894 దాకా టాల్మీ అనేక సైన్స్, ఫిలాసఫీ పుస్తక గురించి ఐన్ స్టీన్ కు వివరించాడు. ఎన్నొపుస్తకాలను చదివించాడు. ఏరన్ బెర్న్ స్టీన్ (Aaron Bernstein) రాసిన పాపులర్ బుక్ ఆన్ న్యాచురల్ సైన్స్ (Popular Book on Natural Science), లుడ్విగ్ బుక్నర్ రాసిన Force and Matter, ఇమాన్యుయెల్ క్యాంట్ రాసిన Criticque of Pure Reason, ధీయోడర్ స్పీయికర్ రాసిన జ్యామెట్రీ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఆ రోజుల్లో మేధో ప్రపంచాన్ని కుదిపేస్తున్న పుస్తకాలు.
కొంతమంది విలేకరులు ఒక సార్ ఐన్ స్టీయిన్ ను ” సైన్సులో మీరు ఇన్ని అద్బుత విజయాలు సాధించారు కదా. అసలు సైన్స్ మీకు తొలుత ఆసక్తి ఎలా కలిగింది?,”అని ఒక సారి విలేకరులు అడిగినపుడు ఐన్ స్టీన్ స్వయంగా తన మీద టాల్మీ ప్రభావం ఎంతో వుందో చెప్పారు.
‘‘Bernstein రాసిన నన్ను బాగా ప్రభావితం చేసింది. Time, Space, Speed of light వంటి వాటి మీద ఎన్నోవిశేషాలున్నాయి. ఆ పుస్తకంలో అప్పటికే ideas on space, time and the speed of light ల గురించి వివరించారు. ఆ పుస్తకం చదివాక వీటి గురించే ఎపుడు ఆలోచిస్తూ ఉండేవాడిని,’’ అని ఐన్ స్టీన్ చెప్పాడు.
ఐన్ స్టీన్ కు టాల్మీ అందించిన మరొక అద్భుతమయిన పుస్తకం Theodor Spieker జ్యామెట్రీ పుస్తకం. స్సీయికర్ జర్మనీలో గణితం టీచర్. గణితంలోజీనియస్ కూడా. త్రిభుజం సూత్రాల్లో వచ్చేస్పీయికర్ సర్కిల్ , సెంటర్ లలోఉండేది ఆయన పేరే. ఈపుస్తకం చదివాక ఐన్ స్టీన్ ఆలోచనలు మ్యాథ్స్ మీదికి మళ్లింది.
తనిచ్చిన పుస్తకాలు ఒక కుర్రవాడిలో ఒక శాస్త్రవేత్తను తట్టిలేపుతున్నాయని టాల్మీకి తెలియదు. ఈపుస్తకాలు చదివి ఐన్ స్టీన్ తన తన గురువు టాల్మీని మించిపోయాడు.
1889 నుంచి 1894 మధ్య నా గురువు టాల్మీయే అని ఐన్ స్టీన్ అంగీకరించాడు.
1894లో టాల్మీ మెడిసిన్ పూర్తి చేసి అమెరికా వెళ్లిపోయాడు.ఐన్ స్టీన్ తో కాంటాక్ట్ తెగిపోయింది. అయితే, అమెరికా న్యూయార్క్ లో టాల్మీ గొప్ప కంటి డాక్టరయ్యాడు. కంటి శుక్లాల ఆపరేషన్ మీద విశేష కృషి చేశాడు.పుస్తకాలు రాశాడు. 1917 లో ఒక గొప్ప వైద్య విశేషం ఆవిష్కరించాడు. టాన్సిల్ఆపరేషన్ చేసిన వారికి పోలియే వస్తుందని ఆయన గ్రహించాడు. అపుడు ఈ ప్రతిపాదనను ఎవరూ పట్టించుకోలేదు. 1929 నాటికి ఇది నిజమని రుజువయింది. పోలియే వైరస్ ను నివారించే యాంటిబాడీలు టాన్సిల్స్ లో ఉన్నాయని, అందువల్ల వాటిని తొలగించిన పిల్లలో పోలియే వస్తున్నది అప్పటికి రుజువయింది.
ఆ తర్వాత మరొక్ 40 యేళ్లు టాల్మీతో ఐన్ స్టీన్ కు సంబధాల్లేవు.
అయితే, టాల్మీ జీవితలో ఒక ఆసక్తి కరమయిన అనుభవం ఎదురయింది. 1991లో నాటికి తీరిక ఉన్నపుడల్లా ఆయన న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో గడిపేవాడు. అక్కడ ఆయన ఐన్ స్టీన్ సైంటిఫిక్ రీసెర్చ్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.
1915లో ఐన్ స్టీన్ ప్రతిపాదించిన ధియరీ ఆఫ్ జనరల్ రిలెటివిటి గురించి చదివాడు. తర్వాత ఆయన ఐన్ స్టీన్ సిద్ధాంతాలను సామాన్యులకు అర్థమయ్యేలా ఒక పుస్తకం రాశాడు.
1932లో ఐన్ స్టీన్ అమెరికాకు వలస వచ్చాక మళ్లీ వాళ్లిద్దరి మధ్య స్నేహ సంబంధాలు మొదలయ్యాయి. అప్పటికే ఐన్ స్టీన్ ఆకాశమంత ఎత్తు ఎదిగి ఉన్నాడు. ఈ పరిచయంతో నే టాల్మీ Personal Recollections of Einstein’s Boyhood and Youth అనే పుస్తకం రాశాడు.
టాల్మీ రగిలించిన సైంటిఫిక్ టెంపర్ ఐన్ స్టీన్ లో ఎంతకు చల్లారనే లేదు. “యునివర్శిటిలో చేరాకా క్లాసులకు, ల్యాబులకు వెళ్లే వాడిని కాను. కాని లైబ్రరీకి వెళ్లే వాడిని. అక్కడే Time, Space ల గురించి ఆలోచిస్తూ వివిధ రకాల పుస్తకాలను చదివే వాడిని. యూనివర్శిటి నుండి డిగ్రీతో బయటకు వచ్చిన తరువాత ఒక పేటేంట్ ఆఫీసులో క్లర్కుగా రెండేళ్లు పనిచేశాను. ఇలా టైమ్ స్పేస్ గురించి ఆలోచిస్తూనే Theory of Relativityని ప్రచురించాను,” అని ఐన్ స్టీన్ చెప్పాడు.
(SVSC Prasad, Maths, Physics coach, Mobile 7901089276)