విశాఖ ఉక్కులో ఈ అర్థరాత్రి పెను ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఎస్ ఎమ్ ఎస్ -2 లో లాడిల్ తెగిపోవడంతో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు కోటి రూపాయుల ఉక్కుద్రవం నేలపాలయినట్లు సమాచారం. ఉక్కు ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలయ్యాయి. ఇద్దరు ఉద్యోగుల పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారని తెలిసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.