హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్య లక్ష్మి ఆలయాన్ని భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు ఉపయోగించుకుంటూ ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అనుమానించింది.
పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ పని చే స్తున్నారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ భాగ్యలక్ష్మి ఆలయాన్ని అడ్డుపెట్టుకుని మత కలహాలు సృష్టించాలని చూస్తున్నాడని విమర్శించారు. చార్ మినార్ పక్కనున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని బిజెపి రాజకీయ కేంద్రం చేసుకోవడం మీద ఆయన స్పందించారు.
బీజేపీ నేతలు మూర్ఖులు. మత ఘర్షణలు పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షు బండి సంజయ్ కొత్త బిక్షగాడు. గతంలో నాలుగుసార్లు ఎన్నికల్లో ఓడారని జాలి తో కనికరించి కరీంనగర్ ప్రజలు గెలిపించారు.
ఇదీ మంత్రి దయాకర్ స్పందన
సంజయ్! .ఇదే నీకు మొదటి పదవి, చివరి పదవికూడా. గంగా జమున తహజిబ్ గా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టకు.సీఎం కేసిఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా నీకు? తెలంగాణ ప్రజలు కొడితే నువ్వు మానేరు డ్యాములో పడతావు. ఢిల్లీ ఆందోళన గురించి మాడ్లాడని బీజేపీ, కేవలం మీడియాలో హైప్ కోసం హైదరాబాద్ మీద, సీఎం కేసిఆర్ మీద మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బలహీన పడటం వల్ల, మత తత్వం సెంటిమెంట్ తో దేశంలో గెలిచారు.
సంజయ్, నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. నీకు దమ్ముంటే కేంద్రం నుంచి నీళ్ల వాటా తీసుకురా. మిషన్ భగీరథ కు, మిషన్ కాకతీయ కు నిధులు తెచ్చావా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కు డబ్బులు తేచ్చావా? నువ్వు ఏమి చేశావో, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి తెచ్చావో చెప్పగలవా?! లేదంటే నిన్ను కరీంనగర్ ప్రజలే ఉరికిచ్చి కొడతారు.మిమ్మల్ని గెలిపించిన దుబ్బాకలోనే మిమ్మల్ని ఉరికించి కొడతారు.
కేసీఆర్ గురించి మాట్లాడితే, పెద్ద వాడివి కాలేవు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించ రని గుర్తు పెట్టుకోండి. కెసిఆర్ మీలా అల్లాటప్పా లీడర్ కాదు. కేసిఆర్ ఉద్యమ నాయకులు. తెలంగాణ తెచ్చిన ప్రజా నేత.తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టీ, చావు నోట్లో తల పెట్టీ, తెలంగాణ తెచ్చారు.
కేటీఆర్, కవిత ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే.కరోనా కారణంగానే జిహెచ్ ఎంసికి ముందస్తు ఎన్నికలు ముందు పెట్టాల్సి వచ్చింది.ముందు అయితే ముందు అంటారు. వెనుకకు అయితే, వెనక అంటారు. మేయర్ ఎన్నికలకు ఇంకా రెండు నెలల టైముంది… ఇప్పుడే ఎందుకు తొందర?