తెలంగాణ రాష్ట్రసమితిని వాగ్యుద్ధంలోకి దించడంలో భారతీయ జనతా పార్టీ విజయవంతమవుతూ ఉంది.
బిజెపి మాటలుఈటెలు ప్రయోగించడంలో దిట్ట. ఈ ట్రాప్ లో టిఆర్ ఎస్ పడుతూ ఉంది. భాగ్యలక్ష్మి గుడిని భారతీయ జనతా పార్టీ రాజకీయ కేంద్రం చేసుకోవడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఈ ఉదయం తీవ్రంగా స్పందించారు. దీనికి భారతీయ జనతా పార్టీ అంతే తీవ్రంగా స్పందించి దయాకర్ రావును ఇరుకున బెట్టింది.
మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ లేదు, టిఆర్ ఎస్ కు ధీటైన పోటీ ఇచ్చేది భారతీయ జనతాపార్టీయే అని ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు బిజెపి ఎంచుకున్న వ్యవూహానికి టిఆర్ ఎస్ నేతలు తలా ఒక చెయ్యేసి సహకరిస్తున్నారు.
టిఆర్ ఎస్ ను బిజెపి బాగా కవ్విస్తూ ఉంది. ఈ కవ్వింపులకు సమాధానం ఇస్తే ఒక సమస్య. ఇగ్నోర్ చేస్తే ఇంకో సమస్య. ఇది టిఆర్ ఎస్ సమస్య.
ఎర్రబెల్లికి బిజెపి అధికార ప్రతినిధి ఎనుగుల రాకేశ్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఇదిగో…
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన పదవి ఎన్నడు ఊడుతుందో అన్న భయంతో బీజేపీ పై విసుర్లు విసురుతున్నారు.
కేసిఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పదవుల కోసం పార్టీలో చేరిన చరిత్ర నీది.
నాలుగుసార్లు ఒడావు అని సంజయ్ అన్నని అనేముందు 6 సార్లు గెలిచి నువ్వు ఒరగబెట్టింది ఏంటో చెప్పు.
దుబ్బాక మిమ్మల్ని ఉరికిచ్చి తన్నితే మీ తన్నీరు ఇంకా లేవలేదు అప్పుడే మళ్లీ దుబ్బాక కు కలవరిస్తున్నారా!
వరంగల్ ప్రజలకు పట్టిన శని తరతరాల బూజు నువ్వు ,నిన్ను వదిలిచ్చుకివడానికి ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన అయుష్మాన్ భారత్ ,ఆవాస్ యోజన , ఫసల్ భీమా యోజన వంటి సంక్షేమ పథకాలను అడ్డుకొని పేదలకు న్యాయం చేస్తుంది మీరు మళ్లీ కేంద్రం ఏం ఇచ్చింది అనడం హాస్యాస్పదం
వరంగల్ లో వరదలొచ్చి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఎక్కడ పోయావ్ ,మంత్రి పదవి కాపాడుకోవడానికి కెటిఆర్ సంకలో పిల్లిలా తిరుగుతున్నావు…
పూటకో పార్టీ మార్చే నువ్వు బీజేపీ గురించి బండి సంజయ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు..
మంత్రిగారి మాటల్లో జిహెచ్ ఎంసిలో ఎంఐఎం తో కలవలేక పోతున్నాం అన్న ఆవేదన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది…
ప్రాజెక్టుల డిపిఆర్ (Detailed Project Report) పంపితే ఎక్కడ అవినీతి బయటపడుతుందో అన్న భయంతో పంపకుండా కేంద్రాన్ని నిందిస్తారా….?
ప్రాజెక్టుల DPR పంపనిదే జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న కనీస అవగాహన లేకుండా మంత్రివి ఎలా అయ్యవయ్యా….?