సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూరుపు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)కి ఒక అనుమానం వచ్చింది. తెలంగాణలో వస్తున్న మిషన్ భగీరధ నీళ్లను ఎవరైనా తాగగలరా? టిఆర్ ఎస్ వాళ్లు ఎపుడైనా మిషన్ భగీరథ నీళ్లను నోట్లోపోసుకుని రుచి చూశారా అని.
భగీరథ నీళ్లు తాగేందుకు పనికి రావని హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ రోజు ఒక సంచలన ప్రకటన చేశారు.
“మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లను ఎవరు తాగడం లేదు, కేవలం మరుగుదొడ్ల కు ఆ నీరు వాడుతున్నారు,” అని ఆయన చెప్పారు.
అసలు టి ఆర్ ఎస్ కార్యకర్తలు నీళ్లు ఆ తాగుతున్నారా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
టి ఆర్ ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నది. 6 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ భగీరథ అని 3 లక్షల కోట్ల భారం ప్రజల పై వేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కల్పించాలని ఇపుడుప్రధానిమోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరడం ఆశ్చర్యం కలుగిస్తుంది. ఎందుకంటే…కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయిందని ప్రారంభోత్సవం కూడా చేశారు. మళ్ళీ జాతీయ హోదా అడగడం ఏమిటి? ప్రజల దృష్టిని మళ్లించాడనికె కేసీఆర్ ఇది అంతా చేస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్ కేంద్రానికి ఇచ్చారా? కమీషన్ల కోసమే మిషన్ భగీరథ!
వరంగల్ కు ఎయిర్ పోర్ట్ తర్వాత, ముందు మంచి రోడ్ల ను వేపించు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్టులు అంటున్నారు. పరేడ్ గ్రౌండ్ నుండి షామీర్ పెట్ వరకు ఎక్స్ప్రెస్ ఫ్లై వోవర్ వేపించు. మొన్నటి ఎన్నికల డామేజ్ ను కవర్ చేసుకోవడానికే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. తీరా చూస్తే మోడీ ఫ్రంట్ లో చేరుతున్నారు
రైతులకు రుణమాఫీ లేదు,పంట నష్టపరిహారం లేదు. హైదరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయని వరద బాధితుల పేరుతో 10వేలు ఇచ్చారు. కష్టాల్లో ఉన్న రైతులను విస్మరించారు
కేంద్రం నుండి తీసుకు రావల్సిన నిధులు కేసీఆర్ తీసుకురాలేకపోతున్నారు.